Analyst Damu Balaji : మెగా ఫ్యామిలీలో ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఆనందంలో అభిమానులు, మెగా ఫ్యామిలీ ఉండగా అపుడే మరో వార్త బయటికి వచ్చింది. ఆదే నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతోందని. నిహారిక, జొన్నలగడ్డ చైతన్య తో ఘనంగా వివాహం చేసారు. ఇక పెళ్ళై మూడేళ్ళైనా కాలేదు అపుడే విడాకులు తీసుకున్నారు. ఇటీవలే కోర్ట్ వీరికి విడాకులను మంజూరు చేయగా అసలు మెగా ఫ్యామిలీలోని అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మెగా ఫ్యామిలీ అల్లుళ్ళంటే చులకన…
మెగా కుటుంబంలో విడాకులు రెండో పెళ్లిళ్లు మామూలే అదికూడా అమ్మాయిల విషయంలోనే. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ మొదట విడాకులు తీసుకుని భర్తతో విడిపోయారు. ఆమె ఎవరో కాదు హీరోలు సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ ల తల్లి. ఇక సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ లే వారి తల్లికి మరో పెళ్లి చేసారు. ఇక మెగాస్టార్ పెద్ద కూతురు ఎపిసోడ్ లో ఉదయ్ కిరణ్ విషయం తెలిసిందే. ఇక చిన్న కూతురు మొదట ప్రేమ వివాహం చేసుకున్నా ఆ తరువాత విడిపోయి మళ్ళీ రెండో పెళ్లి కళ్యాణ్ దేవ్ ను చేసుకుంది.

ఇద్దరు ఆడపిల్లలు కాగా తాజాగా ఆమె కూడా తన రెండో భర్తకు దూరంగా ఉంటోందని వినిపిస్తోంది. ఆమె విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు. ఇక ఇపుడు నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకోవడంతో మెగా ఫ్యామిలీలో అల్లుళ్లకు విలువ లేదని అర్థం అవుతోందని చాలామంది భావిస్తున్నట్లు బాలాజీ తెలిపారు. అయితే నేటి సమాజంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువయ్యాయని ముఖ్యంగా అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్చ రావడం వల్ల వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ బెటర్ ఛాయిస్ చూసుకోవడం వల్ల విడాకులు ఎక్కువయ్యాయని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.






























