Analyst Damu Balaji : ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్ లో ఉండటం వంటివన్నీ కామన్. అయితే ప్రేమ, లివింగ్ టు గెదర్ వరకు ఉంటారు కానీ పెళ్లి పెట్టాలెక్కేది కొంతమందే. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు అందుకున్న వరుణ్ తేజ్ అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పటినుండో వీరి మధ్య రిలేషన్ ఉందని వినిపిస్తున్నా ఎక్కడా ఈ జంట బయటపడలేదు. అయితే తాజాగా ఈ జంట ఇంట్లో పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ జంట హాట్ టాపిక్ అయ్యారు. అయితే వీరి పెళ్లి ఈ ఏడాది చివరన ఉంటుందని వినిపిస్తుండగా లావణ్య బ్యాక్ గ్రౌండ్ గురించి నెట్టింట్లో సోదాలు ఎక్కువ చేస్తున్నారట. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నీ కులమేంటి లావణ్య…
అనలిస్ట్ బాలాజీ మాట్లాడుతూ వరుణ్, లావణ్య చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నా పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే మన వాళ్లకున్న కులపిచ్చి ఇక్కడ బయటపడింది. చాలా మంది నెట్టింట్లో లావణ్య కులమేంటని వెతుకుతున్నారంటూ తెలిపారు. నిజానికి మన తెలుగు రాష్టాల్లో కులపిచ్చి బాగా ఉన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. అయితే ఇండస్ట్రీలో చాలా మంది తమ కో స్టార్స్ని అలా ప్రేమ వివాహాలు చేసుకున్నా కుల పట్టింపులు ఎక్కడా లేదు.

కాకపోతే అగ్రవర్ణాల వాళ్ళు అగ్రవర్ణాల వాళ్లనే చేసుకున్నారు. అందుకే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వరుణ్, లావణ్య విషయంలో కూడా లావణ్య నార్త్ ఇండియన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ బాలాజీ తెలిపారు. ఈ మధ్య కాలంలో కులాంతర వివాహలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.





























