Analyst Damu Balaji : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు గా రాజకీయాల్లో అన్న కోసం వచ్చిన షర్మిల గారు తన పాదయాత్ర ద్వారా అన్నకు రాజకీయాల్లో మంచి మైలేజ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం జగన్ అన్న ఒక రాష్ట్రం చెల్లి షర్మిల ఒక రాష్ట్రం అన్నట్లుగా రాజకీయాలు చేస్తుండగా ఇద్దరి మధ్య ఆస్తి గొడవలున్నాయి అంటూ చెప్తారు. అయితే రాజకీయంగా వేరుగా ఉన్నారు కానీ వాళ్ళు విడిపోలేదు అంటూ వైసీపీ వాళ్ళు చెబుతారు. ఇక కుటుంబం విషయానికొస్తే ఇటీవలే షర్మిల తన పేరు మీదున్న ఆస్తిని పిల్లలు రాజరెడ్డి, అంజలి కి రాసిచ్చింది. ఆ సమయంలో కొడుకు విజువల్స్ చుసిన చాలా మంది హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

హీరోగా షర్మిల కొడుకు… డైరెక్టర్ ఎవరు…
రాజారెడ్డి హీరో కట్ అవుట్ అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో నిజంగానే హీరోగా రాజారెడ్డి రాబోతున్నాడని వినిపిస్తోందంటూ బాలాజీ తెలిపారు. షర్మిల తన కొడుకు చదువుయ్యాక సినిమాల్లోకి తీసుకు రావాలని అనుకున్నట్లు ప్లాన్ చేసారని, అక్కడ క్లిక్ అయ్యాక రాజకీయాల్లోకి తీసుకొస్తారంటూ బాలాజీ తెలిపారు.

రాజారెడ్డి విదేశాల్లో ఎకనామిక్స్, ఫైనాన్స్ లో చదువుకోగా కొద్దిరోజులు భారతి సిమెంట్స్ లో ఇంటర్న్షిప్ చేసి కొద్ది రోజులు సాక్షి పత్రికలో కూడా పనిచేశారట. అలా చదువు పరంగా టాలెంటెడ్ అయిన రాజారెడ్డి ని సినిమాలో హీరో చేయాలనేది షర్మిల కోరికగా చెబితున్నారు. ఇందుకోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ద్వారా లాంచ్ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లు బాలాజీ తెలిపారు.






























