Analyst Damu Balaji : తెలుగు వారు దేశ, విదేశాల్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా కలిసి ఉండాలని ఎవరికి వారు సంఘాలను పెట్టుకుని అక్కడ ఉన్న తెలుగువారికి సహాయపడే ఉద్దేశంతో గ్రూప్ ఏర్పడ్డారు. అలా ఏర్పడిన సంఘమే తానా. తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా. ఇది 1978లోనే ఏర్పడింది. స్థానికంగా ఉన్న తెలుగు వారికి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. అయితే ఎక్కువగా ఒక కులానికి చెందిన వారు ఉండటం వల్ల ఈ సంస్థ ఆ కులానికి సంబంధించినది అనే మాటలు వినిపిస్తాయి అంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు. తాజాగా ఈ తానా సంఘం ప్రతి ఏడాది నిర్వహించినట్లుగా సభలు నిర్వహించగా అందులో రెండు వర్గాలవారు ముష్టి యుద్దానికి దిగారు. ఈ ఇష్యూకి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవడంతో ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జాతి పరువు తీస్తున్నారు…
ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే దానిగురించి స్పందించడానికి కొంతమంది సెలబ్రిటీలు రెడీగా ఉంటారు. అలా నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్లు పెడుతూ ఇష్యూ గురించి తన అభిప్రాయాలను చెబుతుంటారు. తాజాగా జరిగిన తానా సభలో గొడవ గురించి కూడా బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. జాతి పరువు నాశనం చేసారు అని అన్నారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ తానా సభలలో మొదటి నుండి కమ్మ కులం డామినేషన్ ఉంది.

తాజాగా గొడవ కూడా టీడీపీ పార్టీ లోని రెండు వర్గాల మధ్య జరిగింది. సభలో భోజనాలు అయ్యాక కొందరు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం అలా చేయొద్దని లోకేష్ వర్గం అనడం, మాటా మాటా పెరిగి కొట్టుకోవడం జరిగిందని బాలాజీ చెప్పారు. అయితే ఈ ఇష్యూ చాలా చిన్నదే అయినా బండ్ల ట్వీట్ తో పెద్దది గా చేస్తున్నాడు, టీడీపీ లో రెండు వర్గాల పోరు మాత్రమే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.































