Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపించింది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రామోజీ రావు గారికి ఆయన కోడలు శైలజ కిరణ్ గారికి సీఐడి నోటీసుకు పంపించడం చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మరోసారి నోటీసులు…
ఏపీ ప్రభుత్వ సిఐడి మార్గదర్శి సీఈఓ రామోజీ రావు అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శైలజ మీద ఏపీ ప్రోటెక్షన్ అఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు చిట్ ఫండ్స్ చట్టం 1982 రెండు సెక్షన్స్ కింద 76, 79 అలాగే ఐపీసీ సెక్షన్స్ 120(B), (క్రిమినల్ కన్స్పిరేసీ), 409 (క్రిమినల్ బ్రీచ్ అఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్) అండ్ 477(A) 34 (ఫాల్సిఫికేషన్ అఫ్ అకౌంట్స్) కేసులు నమోదు చేసింది.

తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జులై ఐదున విచారణ జరుపనున్నట్లు రామోజీ రావు అలాగే శైలజ కిరణ్ ఇద్దరికీ సీఐడి నోటీసులు జారిచేయడంతో వారిని అరెస్టు చేస్తారనే అనుమానాలు మొదలయ్యాయి అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే కేసులో విచారించినా పెద్దగా రామోజీ రావు గారినుండి సమాధానాలను పోలీసులు రాబట్టలేక పోయారు. ఇప్పుడు మరోసారి విచారణలో ఏం జరగనుందో చూడాలి అంటూ బాలాజీ తెలిపారు. అయితే ఆయన పత్రిక అలాగే మీడియా ద్వారా ఏపీ సీఐడి గురించి కథనాలను రాయడం జరుగుతోందని ఇలాగే అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ గురించి జగన్ అనుకూల మీడియా మాట్లాడటం జరుగుతోందని ప్రభుత్వ వ్యవస్థలను తమ మీడియా ద్వారా విమర్శిస్తున్నారని బాలాజీ తెలిపారు.


































