Analyst Damu Balaji : వైజాగ్ లో గత మంగళవారం సముద్రంలో పడి అనుమానస్పదంగా మరణించిన శ్వేత అనే వివాహిత కేసులో ఎట్టకేలకి ఆమెది ఆత్మహత్య అనే పోలీసులు తేల్చారు. శ్వేత అత్తింటి వారు పెట్టిన వేధింపులను భరించలేక భర్త పట్టించుకోకపోవడం వల్లే మరణించిందని వివరించారు విశాఖ సీపీ త్రివిక్రమరావు గారు. కేసులో లోతుగా దర్యాప్తు జరిపిన ఆయన బృందం మానసికంగా ఆమెను వేధించిన ఆమె అత్తింటి వారికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని ఆమెకు న్యాయం చేస్తామంటూ తెలిపారు. ఇక శ్వేత భర్త మణికంఠ, అతని తల్లిదండ్రులు వారి మీద ఎలాంటి కేసులు నమోదు అయ్యాయి ఎలాంటి శిక్షలు పడనున్నాయి అన్న విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

మణికంఠ నిర్లక్ష్యం ఆమె చావుకు కారణం…
బాలాజీ గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ శ్వేత మరణానికి అత్త, ఆడపడుచు వేధింపులు అలాగే ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల కన్నా భర్త నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటూ తెలిపారు. భర్త హైదరాబాద్ లో ఉండటం తాను వైజాగ్ లోనే ఉండటం, ఇక్కడ అత్తింట్లో జరుగుతున్న విషయాలన్నీ భర్తతో చెప్పినా భర్త పట్టించుకోకపోవడం తనను కృంగ దీసి ఉండవచ్చు అంటూ తెలిపారు. ఆమె చనిపోవాలని అనుకునే ఇంట్లోనే తన ఫోన్ అలాగే లెటర్ ఉంచి వెళ్ళింది. లెటర్ లో కూడా నేను లేకున్నా నీకేం ఫీలింగ్స్ ఉండవు అంటూ భర్త గురించి రాసింది అంటే భర్త ఆమెను పట్టించుకోలేదనే బాధ ఉంది అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఇక శ్వేత విషయంలో ఆమె భర్త మణికంఠ ఏ1 గాను అలాగే మామ శాంతరావు ఏ2 గాను అత్త పుష్పలత ఏ3 గాను అలాగే ఆడపడుచు భర్త సత్యం ఏ4 గాను కేసులు నమోదు చేసారు. వరకట్నం వేధింపులు కేసు పెళ్ళైన ఏడేళ్ల లోపు పెట్టొచ్చు. శ్వేత పెళ్ళై ఏడాది కావడం వల్ల ఈ గృహ హింస కేసు సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేసారు ఈ సెక్షన్ కింద మూడేళ్లు జైలు శిక్ష లక్ష వరకూ జరిమానా విధిస్తారు.

అలాగే సెక్షన్ 304బి వరకట్నం వేధింపులు కింద కేసు నమోదు ఈ సెక్షన్ కింద నేరం ప్రూవ్ అయితే ఏడేళ్ల జైలు శిక్ష నుండి మాక్సిమమ్ జీవిత ఖైదు పడుతుందని బాలాజీ తెలిపారు. ఇక లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసారు. ఇది శ్వేత ఆడపడుచు భర్త సత్యంకు వర్తిస్తుంది అంటూ తెలిపారు. అయితే శ్వేత కేసులో ఆల్రెడీ ఆమె డిప్రెషన్ లో ఉండి మేము ఏమి చేయకపోయినా సుసైడల్ ఆలోచనలు ఉన్నాయంటూ మణికంఠ కుటుంబం మాట్లాడుతున్నారు. ఇంటి చుట్టు పక్కల వాళ్ళను మేనేజ్ చేసేసారు. ఈ కేసు నిలబడదు అనే అనిపిస్తుంది. కేవలం ఇక శ్వేత ఫోన్ లో ఏమైనా ఆధారాలు ఉంటే అపుడు కేసు నిలబడుతుంది అంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు.































