Analyst KS Prasad : జగనన్న విడిచిన బాణంగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ చెల్లిగా రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నకు అండగా నిలబడిన షర్మిల ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ నియంత్రత్వ పాలనపై మరోసారి పోరాటం చేస్తానంటూ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఇక రాజకీయంగా మరోసారి తానేంటో చూపించడానికి సిద్ధమైన షర్మిల అపుడు అన్న కోసం పోరాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ తో పోరాడుతా అంటోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు వేరే ఉంది అంటూ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అంటున్నారు.

షర్మిల పార్టీ పెట్టింది అందుకే…
జగన్, షర్మిల ఆస్తుల కోసం కోట్లాడారని అందుకే షర్మిల ఏపీ లో లేకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఇక్కడే ఉంటోందని బయటికి వినిపిస్తున్న ప్రచారంలో నిజం లేదని కేఎస్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో జగన్ షర్మిల కు ఉన్న ఆస్తులు సుమారు 200 నుండి 300 కోట్ల వరకు ఉంటాయి. వాటిని కాపాడుకోవాలంటే అక్కడ వారి ఉనికి ఉండాలి. అందుకే షర్మిల చేత పార్టీ పెట్టించారు. షర్మిల పార్టీ ద్వారా కొన్ని వర్గాలను ప్రభావితం చేసినా అది వారికి ఉపయోగమే.

ఇక వైసీపీ లో మొదటి నుండి ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వేరే పార్టీలో ఉండవచ్చు కానీ జగన్ చెబితే షర్మిల కోసం పనిచేసి ఒక పది సీట్లు ఇద్దరూ కలిసి గెలుచుకుని జగన్ అక్కడ చక్రం తిప్పేలా చెయగలరు అంటూ వారి వ్యూహాలు అవి అంతే కానీ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయ పరిజ్ఞానం కొంచం ఉన్నవారికైనా ఈ విషయం అర్థం అవుతుంది అంటూ చెప్పారు.

































