కరోనాను కట్టడి చేసేందుకు తానూ తాయారు చేసిన మందుపై ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అన్నారు ఆనందయ్య. ఈరోజు మీడియాతో మాట్లాడిన అయన తన మందు ముమ్మాటికీ ఆయుర్వేదమే అని కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నానని తెలిపారు ఆనందయ్య.

తను ప్రజల మేలుకోసమే ఈ మందును తయారు చేసానని అంతకు మించి మరో ఉద్దేశ్యం తనకు లేదని తెలిపారు. అయితే వేల మందికి మందు తయారు చేయాలి అంటే కాస్త సమయం పడుతుందని ఆయన అన్నారు. మరోవైపు హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితిపై మాట్లాడుతూ కోటయ్యకు మందు వేసి నాలుగైదు రోజులు అయిందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారన్నది ఆబద్ధం. నా మందువల్ల తనకు అలా అయ్యిందని చెప్పలేమని అన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిని కట్టడి చేయాలని కోరారు.



























