Ananth Sriram : తెలుగు గేయ రచయిత అనంత్ శ్రీరామ్, పాటలను ఎంత అందంగా రాస్తాడో అందరికీ తెలుసు. ఇప్పటివరకు తన 14 సంవత్సరాల సినిమా కెరీర్ లో 990 పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ ‘సాక్ష్యం’ సినిమాలో నటించారు కూడా. ‘కాదంటే అవుననిలే’ అనే సినిమాకు మొత్తం పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ చిరంజీవి గారి సినిమాలైన అందరివాడు, స్టాలిన్ లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాకు పాటలు రాసి విమర్శకుల ప్రశంశలతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

స్టేజి మీద భార్య తో కలిసి డాన్స్ చేసిన అనంత్ శ్రీరామ్…
అనంత్ శ్రీరామ్ చాలా టీవీ కార్యక్రమాలకు వచ్చారు. అతిథిగాను, న్యాయ నిర్ణేతగా చాలా షోస్ లో పాల్గొన్నారు. అయితే అపుడు ఆయన భార్యను తీసుకురాలేదు. అయితే తొలిసారిగా అనంత్ శ్రీరామ్ తన భార్యతో ప్రోగ్రాంలో డాన్స్ చేస్తూ అందరినీ షాక్ కి గురిచేసారు. ‘జీ తెలుగు వారి జాతర అందరూ ఆహ్వానితులే’ అంటూ ఈవెంట్ చేయబోతున్నారు జీ తెలుగు టీవీ ఛానెల్ వారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోలో నిజమైన సెలబ్రిటీ జంటలు కనువిందు చేసాయి.

ఒక్కొక్కరు రొమాంటిక్ పాటలకు డాన్స్ చేస్తూ ఆదరగొట్టారు. అలా అనంత్ శ్రీరామ్ తన భార్యతో కలిసి తొలిసారి టీవీ స్టేజి పై డాన్స్ చేసి అలరించారు. ఇక తన భార్యపై సటైర్ వేసి అందరినీ నవ్వించారు. ఇలా అనంత్ శ్రీరామ్ ఆయన భార్య స్వాతి జీ తెలుగులో సందడి చేయడం తొలిసారి. ఇక ‘సీతా రామం’ సినిమా హీరో దుల్కన్ సల్మాన్ షో కి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. అయితే ఇక ఈ జీ తెలుగు జాతర అందరూ ఆహ్వానితులే ప్రోగ్రామ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. సెలబ్రిటీల సందడి, ఆట పాట చూడాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.































