Ananya Nagalla : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా తారల మెడకు ఉచ్చు బిగుస్తోంది. హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల,మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ వంటి వారి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వర్ధమన నటి తెలుగుమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు పేరు తెచ్చుకుంది అనన్య. మల్లేశం, కోర్ట్, పొట్టేల్, డార్లింగ్, వకీల్ సాబ్ వంటి సినిమాలతో నటిగా పేరు తెచ్చుకుంది. అయితే బెట్టింగ్ యాప్ ప్రచారం చేసి ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనన్య ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో ఈ ఇష్యూ గురించి చర్చలో పాల్గొంది.

బెట్టింగ్ ప్రచారంలో ఎన్ని కోట్లు సంపాదించావ్….
అనన్య నాగళ్ళ బెట్టింగ్ యాప్ కోసం ఒకసారి ప్రచారం చేయగా లక్ష దాక ఇచ్చారని ఆ తరువాత ఇక ఎపుడు ప్రచారం చేయలేదట. తాజాగా డిబేట్ లో టీవీ5 మూర్తి అనన్య ను ప్రశ్నిస్తూ బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం ఎందుకు ప్రచారం చేసావ్ దాని వల్ల ఎన్ని కోట్లు వచ్చాయి అంటు ప్రశ్నించారు. లా చదువుకున్న అనన్య ఎందుకు ఏమాత్రం ఆలోచించకుండా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసింది అంటూ అడిగారు.
మొదట్లో బెట్టింగ్ యాప్స్ ప్రచారం కోసం వీడియో చేసినపుడు దాని దుష్ప్రభావాలు తెలియలేదని ఒకసారి దాని వల్ల నష్టపోయిన వారు నన్ను సంప్రదించినపుడు వారికి డబ్బు సహాయం కూడా చేసినట్లు చెప్పారు అనన్య. ఒకే ఒకసారి తను బెట్టింగ్ యాప్స్ కీ ప్రమోషన్ చేసానని దాని గురించి పూర్తిగా తెలిసాక ఇక చేయలేదని చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో ఉండేవాళ్ళు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ సెలబ్రిటీలా వల్ల త్వరగా ప్రభావితం అవుతారని అందుకే ఏదైనా ఎండోర్స్ చేసేముందు జాగ్రత్త పడాలని మూర్తి సూచించారు.



























