Anasuya Bharadwaj : తెలుగు బుల్లి తెర పై జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన యాంకర్ అనసూయ. కెరీర్ పీక్స్ కి వెళ్ళాక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. కానీ అనసూయ మాత్రం ఇద్దరు పిల్లల తల్లిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అయినా జబర్దస్త్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా అవకాశాలను కూడా అందుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది.

భర్తతో సముద్ర తీరాన…..

అనసూయ ప్రొఫెషనల్ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబంతో కూడా గడపడానికి అంతే ప్రాముఖ్యతను ఇస్తుంది. అనసూయ తన భర్త భరద్వాజది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు మగపిల్లలు. కెరీర్ పరంగా బాగా బిజీగా ఉండే అనసూయ తీరిక దొరికినపుడు తన కుటుంబంతో సేదతీరుతుంటుంది. తాజాగా తన 12 ఏళ్ల వైవాహిక జీవితాన్ని అనసూయ తన భర్త భరద్వాజతో తన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక సముద్ర తీరాన చేతిలో చేయి వేసుకుని నడుస్తూ చాలా అందంగా వారి బంధాన్ని వర్ణిస్తూ నెటిజన్స్ తో తన అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో అందరిని ఆకర్షిస్తున్నాయి.
ప్రేమతో మొదలైన వీరి ప్రయాణం పెళ్లితో బలపడి తమ జీవితాన్ని ప్రేమానుబంధంతో ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఫోటోల ద్వారా మనకు అర్థమవుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేవారిపై ఎన్నో గాసిప్స్ వస్తుంటాయి. అయితే వీటివల్ల ఎన్నో జీవితాలు నాశనం కూడా అవుతుంటాయి. అలాంటి ఫీల్డ్ లో ఉండి కూడా అనసూయ తన కెరీర్ ను ఇటు వ్యక్తిగత జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తోంది. ఇక ఈ జంట ఇపుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళలు ఉంటుందంటారు, కానీ ఒక మహిళల కెరీర్ విజయం వెనుక కూడా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉండాలనేది అనసూయ, శశాంక్ భరద్వాజ్లను చూస్తే తెలుస్తోంది.



























