బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేస్తోంది అనసూయ భరద్వాజ్. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటోంది. సోగ్గాడే చిన్నినాయనా నుండి పుష్ప 2 వరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హాట్ యాంకర్, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

అనసూయ కేవలం సినిమాలతోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌లకు వెళ్లిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. “హే సిరి, నాకోసం పాడు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోల్లో అనసూయ చీకట్లో మెరిసే అందంతో కట్టిపడేస్తోంది. కాటుక కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు హాట్ కామెంట్లతో ఆమెను ముంచెత్తుతున్నారు. అనసూయ అందానికి, ఆమె కళ్లలోని మెరుపుకు ఫిదా అవుతున్నారు.



























