Anasuya: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ భరద్వాజ ఒకరు. ఈమె యాంకర్ గా బుల్లితెరపై కొనసాగుతూ తన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెరపై సందడి చేసిన అనసూయకు వెండి తెరపై సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా వెండి తెర సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి అనసూయ ప్రస్తుత కెరియర్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇక ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడే అనసూయ తాజాగా ప్రముఖ యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సింహంతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సె**గురించి ఓపెన్ గా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ అనసూయైన ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో అబ్బాయిలు తమ కంటే వయసులో పెద్దవారైనా అమ్మాయిలని కోరుకుంటున్నారు. అబ్బాయిల వయసు 20 నుంచి 25 లోపు ఉన్నవారు కూడా 30 నుంచి 35 సంవత్సరాల ఉన్న అమ్మాయిలు కావాలని కోరుకుంటున్నారు కదా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అనసూయ మాట్లాడుతూ..సెక్సువల్‌గా కోరుకుంటున్నారా అంటూ ఓపెన్ గా అడిగేసారు. ఈ ప్రశ్నకు నిఖిల్ మాత్రం సెక్సువల్ అని కాదు లస్ట్ కామం అని నిఖిల్ అనడం.. దాంతో వెంటనే అనసూయ అందుకొని లస్ట్ అంటే సెక్సే కదా అనడం జరిగింది. సెక్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కానీ జనాలు దానినీ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.
సెక్స్ అవసరమని బహిరంగంగా చేసుకోవాలని బహిరంగంగా దాని గురించి మాట్లాడమని కాదు కానీ, దానిని అంతగా తప్పుపట్టాల్సిన అవసరం కానీ ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంటూ అనసూయ ఎంతో ఓపెన్ గా మాట్లాడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
































