బహిస్టు అపచారం కాదు…ప్రకృతి ధర్మం. బహిస్టు రాకపోతే మనిషి జన్మలేదు. సృష్టి శూన్యం అవుతుంది.
స్త్రీకి ప్రతినెల వచ్చే బహిస్ట్ అనేది ప్రతి మహిళ శరీరంలో జరిగే ప్రక్రియ. ఆ 3 రోజులు శరీరం నీరసంగా ఉంటుంది కాబట్టి ఒకదగ్గర కూర్చోవాలని ఆరోజుల్లో ఆడవాళ్ళు చేసుకున్న ఏర్పాటు స్త్రీలకు కూడా ఈవిషయం తెలియక ఈరోజుల్లోకూడా కోట్లమంది స్త్రీలు అపచారం అనుకుంటారు, ఇది శరీరంలో జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ. దీన్ని అనవసరపు రాద్ధాంతం చేయడం మూర్ఖత్వం.

భారత సమాజంలో ఋతుస్రావం గురించి పబ్లిక్ గా మాట్లాడటం నేరంగా, బూతుగా భావించే దుర్మార్గమైన సంస్కృతి పాతుకుపోయి ఉన్నది. ఋతుస్రావం పట్ల ఇంకా అనేక చర్చలు జరగవలసి ఉంది. అనేక గొంతులు మౌనాన్ని వీడాల్సి ఉంది. ఈ సమాజంలో పెనుమార్పులతో కూడిన నూతన చైతన్యం వెల్లివిరియాల్సి ఉంది. స్త్రీలు ప్రతినెలా 3 రోజుల నుండి 5 రోజుల పాటు ఋతుస్రావానికి బాధపడాల్సి ఉంటుంది. అది ప్రకృతిలో సహజమైనప్పటికి ఆ సమయం చాలా భయంకరమైంది. ఆ సమయంలో స్త్రీలు పడే ఇబ్బంది, పెయిన్, వేదనను అక్షరీకరించడానికి అక్షరాలు పూర్తిగా న్యాయం చేయలేమని గొల్లుమంటాయేమో. తీవ్రమైన బాధ, కడుపునొప్పి, ఒక్కోసారి ప్రాణాలు పోతాయేమోనన్నంతటి పెయిన్, నీరసం లాంటివి స్త్రీలను పీడిస్తాయి.

ఆ వేదననంతటినీ ఓర్చుకోవడం కోసం బాధనంత పంటి బిగువున దాచేస్తుంటారు. అసహజమైన స్థితి లోంచి కృత్రిమ చిరునవ్వుతో సహజమైన స్థితిలోకి వస్తుంటారు. యధావిధిగా అందరిలో కలిసి పోతుంటారు. కలిసిపోతు వాళ్ళు ఎంత అలసిపోతారో మన సమాజం ఎప్పుడూ గుర్తించదు. కనీసం గమనించదు. అట్లా చేయడానికి ప్రయత్నించదు. అంతే కాదు. ఋతుస్రావాన్ని అంటుగా చూస్తుంది. గడప అవతలకి ముట్టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరికే చలిలో అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానికి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం సిగ్గుపడదు. అట్లాంటి సంస్కృతి ఎంత కృరమైందో ఆలోచించాల్సి ఉంది. మనిషి బాధను గుర్తించడానికి సిద్ధపడని అనాగరికతను సంస్కృతిగా చెలామణి చేయడం ఎంత సిగ్గులేని తనమో కదా.. అంటూ మన జబర్దస్త్ షో బ్యూటీ అనసూయ సోషల్ మీడియాలో పీరియడ్స్ స్టోరీ వీడియో పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది.

ప్రతీ అమ్మాయి జీవితంలో నెలసరి టైం అనేది ఎంతో కీలకమైన అంశం. మరి అలాంటి పీరియడ్స్ కోసం మాట్లాడటానికే సిగ్గు పడుతూ అదేదో పెద్ద నేరం అన్నట్లుగా రహస్యంగా ఉంచుతుంటారంతా. కానీ రంగమ్మత్త మాత్రం తాను అందరిలాంటిదాన్నికాదని నిరూపిస్తూ పీరియడ్స్ స్టోరీ చెప్పి తన ఫస్ట్ పీరియడ్ విషయాలను బహిర్గతపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియో షంషేర్ గా సంచలనం సృష్టించింది. దాదాపు 7 నిమిషాలున్న ఈ వీడియోలో పీరియడ్స్ గురించి కుండబ్రద్ధలు కొట్టినట్లుగా మాట్లాడింది అనసూయ. ఈ మేరకు తన మొదటి పీరియడ్ అనుభవాలను సైతం పంచుకుంది. మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగానే ఈ విషయాలపై స్పందించింది మన రంగమ్మత్త.

ఈ వీడియోలో పీరియడ్స్ సమయంలో మహిళలు పడే ఇబ్బందులకోసం చెబుతూనే తన మొదటి పీరియడ్ అనుభవాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఫస్ట్ పీరియడ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. ఆ టైంలో దాదాపు 2 వారాలు ఇంట్లోనే ఓ మూలాన కూర్చోబెట్టారని, ఆ తర్వాత ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో 3,4 రోజులు ఎవరినీ కలిసే అవకాశం వుండేది కాదని చెప్పింది. అయితే ప్రారంభంలో తనకు ఈ విషయమై ఏం జరుగుతుందో తెలియకపోయినా 17 ఏళ్లు వచ్చిన తర్వాత అంతా అర్థమైందని తెలిపింది. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. ఇవి ఇలా బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతూ బాగానే చక్కర్లు కొడుతుంది. కావాలంటే మీరూ ఒకసారి ఓ ఆ వీడియో కధేంటో ఓ లుక్కేయండి.????



























