కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్స్ లేక సెలెబ్రెటీస్ అందరు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉండి ఇంస్టాగ్రామ్, ఫెస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో వారి అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా తన అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా ఆమె ఆసక్తికరంగా జాబులు ఇచ్చింది.

అయితే ఒక నెటిజన్ మాత్రం కొంచెం బోల్డ్ క్వశ్చన్ నే అడిగాడు.. విషయానికి వస్తే లైవ్ చాట్ లో ఒక యువకుడు “మీకు మాత్రమే చెప్తా.. సినిమా టైంలో ఆ సినిమా హీరో తరుణ్ భాస్కర్ తో కలిసి పార్టీలో మద్యం తాగి రచ్చ రచ్చ చేశారంటకదా.. అని అడిగేసాడు. అతను అడిగిన ప్రశ్నకు షాక్ అయిన అనసూయ.. ఆ తరువాత అతనిపై కోపంతో రగిలిపోయింది. ” చేశారట… చూశారట.. అంటూ ఆ ఆటా..లు మీరు మాట్లాడుకోవడానికి చర్చించుకోవడనికి బాగుంటాయి. కానీ నువ్వు ఇంకా పరిణితి చెందాలి” అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. అనసూయ సమాధానంతో ఆ టాపిక్ అక్కడితో ముగిసింది. అయితే అప్పట్లో ఒక టాప్ యాంకర్ పబ్ లో పార్టీ చేసుకుంటూ పడిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇదే చాట్ లో మరికొన్ని ప్రశ్నలకు కూడా అనసూయా సమాధానమిచ్చింది.




























