లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉండి ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో తన అభిమానులతో నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. తాజగా మొన్న కూడా లైవ్ లో తన అభిమానాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో కొన్ని వ్యక్తిగా విషయాలను చెప్పుకొచ్చింది అనసూయ. తన కుటుంబం మరియు పిల్లల గురించి కూడా చెప్పింది.

అయితే అందులో ఒక నెటిజన్ తన డ్రెస్ పై వ్యాఖలు చేసాడు. దీనిపై అనసూయకు ఒళ్ళుమండింది… దీనితో రెచ్చిపోయి అసలు నువ్వేవాడవురా నన్ను అడగటానికి అంటూ తిట్లదండకం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ అయింది. ఇదివరకే తన డ్రెస్సింగ్ విషయంలో పెద్ద రచ్చే చేసింది. అప్పట్లో కూడా ఇలాగె అభిమానిమీద మండిపడింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. ఆ నెటిజన్ నువ్వు పిల్లల తల్లివి ఈ డ్రస్ ఏంటి కాస్త మంచి డ్రెస్ వేసుకుని, కాస్త పద్దతిగా ఉండొచ్చు కదా అంటూ ప్రశ్నించాడు.

దీనితో అసలు నువ్ ఎవడవురా నా బట్టలు గురించి మాట్లాడటానికి… తల్లి అయితే ఈ డ్రెస్ వేసుకోవాలి అనే రూల్ ఏమయినా ఉందా? అసలు అమ్మతనం గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు అంటూ రెచ్చిపోయింది. ఇంకోసారి నా బట్టలు గురించి మాట్లాడే అర్హత ఎవడికి లేదు అంటూ రెచ్చిపోయింది.


































