“జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో” ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులరైంది. ఒక్కమాటలో చెప్పాంటే జబర్దస్త్ కామెడీ షోకి ఇంత మంచి క్రేజ్ రావడానికి ఒకరకంగా అనసూయ అందాల ప్రదర్శనే కారణమని చెప్పవచ్చు.

జబర్దస్త్ షో బాగా పాపులరవడంతో అనసూయకు అటు ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ఇటు ఆడియో ఫంక్షన్లు, ఇతర ఛానెల్స్ లో యాంకర్ గా మంచి ఛాన్సులే వచ్చాయి. ముఖ్యంగా సినిమాల్లో కూడా అనసూయకు మంచి ఛాన్సులు రావడంతో సడెన్ గా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఇక టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు మరదలిగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నటించిన అనసూయ ఆ తర్వాత “రంగస్ధలం” చిత్రంలో రంగమ్మత్తగా మంచి గుర్తింపు వున్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈమధ్య “రంగస్థలం” అనే ఓ రియాలిటీ షోకు అనసూయ యాంకర్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ షోకు సంబందించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. పాత ఎపిసోడ్స్ లో జరిగిన సరదా సంఘటనలన్నిటినీ ఎడిట్ చేసి ఒక వీడియో రూపంలో షేర్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

ఇంతకీ ఆ వీడియో అంతలా వైరలవడానికి కారణమేమిటంటే.. ఆ వీడియోలో కమెడియన్ రోహిణి మన రంగమ్మత్తకు లిప్ టు లిప్ కిస్స్ ఇవ్వబోయింది. ఆ సంఘటనకు వెంటనే స్పందించిన అనసూయ ఏదో ముద్దు ఇస్తే తుడిచేసినట్లుగా తనదైన శైలిలో నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలో మా టివిలో ప్రసారమైన “మా మహాలక్ష్మి” ప్రోగ్రామ్ లో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే జరగడం విశేషం. మా టివి ‘మా మహాలక్ష్మి’ షోలో అందంగా చీర కట్టుకుని, అచ్చతెలుగు అమ్మాయిలా వయ్యారంగా నడుచుకుంటూ, డ్యాన్స్ చేస్తూ అనసూయ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన సంగతి విదితమే. అయితే ఈ షోలో ఓ యువతి ఇచ్చిన షాక్ కు అనసూయ మైండ్ బ్లాక్ అయ్యింది.
అప్పటి వరకూ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులందరి మనసులనూ దోచిన అనసూయకు షో మధ్యలో ఓ అమ్మాయి వచ్చి హఠాత్తుగా లిప్ లాక్ ఇచ్చేయడంతో ఊహించని ఆ సంఘటనకి అనసూయకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. అనసూయను వయస్సులో వున్న కుర్రోళ్ళు బాగా ఇష్టపడి తమ కలల రాణిగా ఊహంచుకుంటున్నారనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అమ్మాయిలు కూడా ఈ రకంగా కిర్రెక్కిపోతున్నారా.? అని అందరూ విస్తుపోయారు. ఈ 2 లిప్ లాక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తుండటంతో అనసూయకు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతుందని చెప్పవచ్చు.



























