వెండితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్, బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది అంటే తెలియని వాళ్ళుండరు. జబర్దస్త్ షో లో అనసూయ, హైపర్ ఆది జంటగా చేసే కామెడీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలానే వుంది. హైపర్ ఆది అనసూయ పై అదిరిపోయే పంచ్ లు వేయడం, ఆ పంచ్ లు పేలి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భాగా వర్క్ అవుట్ అవడంతో జబర్దస్త్ షో బాగా విజయవంతమైంది.

ఇదిలావుండగా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా అటు సినిమా, ఇటు సీరియల్ షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ షూటింగ్ లు మొదలవుతున్న శుభ సందర్భంలో హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లుగా తెలిసింది. వీళ్ళిద్దరూ జంటగా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారనే గాసిప్స్ వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్ కే మంచి డిమాండ్ వుండటంతో అనసూయ, హైపర్ ఆదితో కలిసి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తుందని, ఈ వెబ్ సిరీస్ కోసం అనసూయ భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తుందని, అంతేకాకుండా హైపర్ ఆదికి కూడా తనతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆఫర్లు రాకపోవడంతో ఖాళీగా వున్న హైపర్ ఆదికి అనసూయ ఈవిధంగా హెల్ప్ చేయడంతో ఆది మన రంగమ్మత్తకు థ్యాంక్స్ చెప్పినట్లు తెలిసింది.



























