కరోనా ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో అత్యవసర సేవలు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా షూటింగులు, టీవీ షోలు అన్నిటికి బ్రేక్ ఇవ్వడంతో సెలెబ్రేటిస్ అందరు కూడా టైం పాస్ కోసం ఎదో ఒక పని చేస్తున్నారు. కొందరు అభిమానులతో లైవ్ చాట్ పెట్టి ముచ్చటిస్టున్నారు. మరి కొందరు తమదైన రీతిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. స్పూఫ్ లు చేస్తూ ఆకట్టుకుంటున్న వారు ఉన్నారు.

తాజాగా యాంకర్ అనసూయ, మరో యాంకర్ రవి, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ కంటిస్టెంట్ అలీ రెజా అందరు కలిసి హైడ్ అండ్ సీక్ ఆడారు.. హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు అనుకుంటున్నారా? కదండీ బాబు.. యాంకర్ రవి లాప్ టాప్ లో ఎదో పని చేస్తూ ఉండగా రవి కూతురు వియ వచ్చి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడమని చెప్పింది. అలా మొదలైన గేమ్ లో యాంకర్ అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా లు ఎంట్రీ ఇచ్చి అభిమానులను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో మీకోసం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here