ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు నటనతో కూడా ఆకట్టుకుంటూ…ప్రస్తుతం వరుస అవకాశాలతో వెండితెరపై దూసుకుపోతోంది జబర్దస్త్ యాంకర్ అనసూయ.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది..ఇక రంగస్థలంతో పటు ‘క్షణం’ లో కూడా నెగటివ్ రోల్ లో అద్భుత నటనని కనబరిచింది. వాటితో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటిస్తూ ఒక పక్క యాంకర్ గా, మరోపక్క నటిగా కొనసాగుతుంది. అసలు విషయంలోకి వెళ్తే అనసూయ పై తాజాగా తాను వేసుకునే బట్టలపై కన్న కొడుకే కామెంట్స్ చేయడం విశేషం.

తాను వేసుకునే బట్టలు కొడుకుకి నచ్చడం లేదంటూ అనసూయ అంటోంది. అలాంటి బట్టలు వేసుకోవద్దని తన కొడుకు అంటే దానికి బదులుగా అనసూయ నేను వేసుకునే బట్టలు నాకు సౌకర్యంగా ఉంటాయి. ‘నేను ఇష్టపడి ఆ బట్టలను వేసుకున్న నువ్వెందుకు నా ఇష్టాన్ని కాదంటున్నావ్’ అంటూ తన కొడుకుకే పంచ్ ఇచ్చింది అనసూయ ఆఖరికి తమ పిల్లల్లే తల్లి ఏ బట్టలు బాగుంటాయో చెబుతున్నారు. బట్టల విషయంలో పిల్లలే తల్లులను ప్రశ్నించే స్థాయికి వెళ్లారు. అనసూయ వేసుకునే బట్టల విషయంలో తన కన్న కొడుకే కాదు అనేక మంది కామెంట్స్ చేస్తున్నడడం మనం సోషల్ మీడియా లో చూసే ఉంటాము. పెళ్ళై ఇద్దరు పిల్లలలు ఉన్నారు బట్టలు సరిగా వేసుకోవచ్చు కదా అంటూ చాలా మంది అనసూయ పై ఫైర్ అవడం మనం చూసాం.
అయితే సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నపుడు వారికీ గట్టిగా కౌంటర్ ఇస్తుంటారు. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అంటూ వారికీ అనసూయ గట్టిగా సమాధానము ఇస్తుంది. ఎవరు ఎమన్నా కూడా అనసూయ తన పనేంటో చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా కన్న కొడుకు కూడా అనసూయ వేసుకునే బట్టలపై కామెంట్స్ చేసినా.. దాన్ని కూడా పట్టించుకోకుండా.. తనకి నచ్చిన బట్టలే వేసుకుంటా అంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ…!!



























