అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి.. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ !!

0
221

తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు, ‘రంగమ్మత్త’ వంటి పాత్రలతో వెండితెర పైనా శెభాష్‌ అనిపించుకున్నారు హాట్ యాంకర్, సినీనటి అనసూయ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ షోలో ఆమె పాల్గొని సరదా సరదా ముచ్చట్లతో పాటు, తన జీవితంలో పడిన కష్టాలను చెప్పుకొచ్చింది అనసూయ.

బుల్లితెర తనకు అమ్మ వంటిదని, వెండితెర నాన్న లాంటిదని తన కోసం, తన సిస్టర్స్‌ కోసం వాళ్ల అమ్మ ఎంతో కష్టపడిందని, చీరలకు ఫాల్స్‌ కుట్టి మరీ చదివించిందని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది అనసూయ. ఇంటి అద్దెలు కట్టలేక తక్కువ అద్దెకు దొరికే ఇళ్లకు మారి పోయేవాళ్లమని, అప్పుడు తమ కుటుంబం ఉన్న పరిస్థితుల్లో 50 పైసలు ఆదా చేయడానికి 2 బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్నంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన అనసూయ తనపై వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్, వాటి వల్ల కలిగిన దుష్పరిణామాలు, తీసుకున్న చర్యలన్నింటినీ ఈ షోలో వివరిస్తూ..

ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంక ఈ ట్రోలింగ్ వివరాల్లోకి వెళ్తే.. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘ఇట్స్ టైం టు పార్టీ’ సాంగ్ లో నటించే ఛాన్స్ వస్తే ఆ ఆఫర్‌ను అనసూయ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఆ సాంగ్ లో చేయకపోవడం మంచిదైంది.. లేకపోతే గుంపులో గోవిందలా అయ్యేది నా పని’ అని అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్‌తో తనపై ట్రోలింగ్ మొదలైందని, ఆ ట్రోలింగ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లి చాలా రోజులు బాధ పడ్డానని, ఆ టైంలో తన ఫ్యామిలీ, తన భర్త అందరూ తోడుగా ఉండబట్టే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని, కొన్ని రోజులకు సినీరంగంలో ఇలాంటివన్నీ కామన్ అని అర్ధం చేసుకుని ఇప్పుడు రెబల్‌గా తయారయ్యి..

ఏ సమస్య వచ్చినా ధీటుగానే సమాధానం ఇస్తున్నానని, ఇప్పటికీ తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళందరి స్క్రీన్ షాట్స్, కామెంట్స్ అన్ని తన వద్ద భద్రంగానే ఉన్నాయని,.. తన దగ్గర FIR పేపర్స్ కూడా సిద్ధంగా వున్నాయని, కరోనా లాక్ డౌన్ పూర్తయిన వెంటనే వాటి సంగతి చూస్తానని.. సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టే సమస్య లేదని అనసూయ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను హాట్ యాంకర్ అనసూయ ఆలీతో సరదాగా షోలో పంచుకున్నారు. ఆగస్టు 24న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రసారమైంది. వీలైతే మీరూ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here