గ్లామర్ ఫీల్డ్ లోని కధానాయికల కధలన్నీ విషాదాంతం కాదు.. హ్యాపీ గా పెళ్ళి చేసుకుని.. పిల్లలను కని.. భర్త తో కలిసి ఆనందంగా లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చని నిరూపిస్తుంది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై మెరుస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా సక్సెలు సాధిస్తుంది ఈ రంగమ్మత్త. తన కెరీర్ ఇంత బాగా డిజైన్ చేసుకోడానికి.. తానింతగా సక్సెస్ కావడానికి కారణమంతా తన భర్త భరద్వాజే అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తుంది. అనసూయ, భరద్వాజ్ దంపతులు తమ దాంపత్య జీవితాన్ని పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు జవాబులిస్తుంది అనసూయ.

ఈ ఛాటింగ్ లో భాగంగానే తనకు సుశాంక్‌ భరద్వాజ్‌తో మధ్య ఏర్పడిన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది అనసూయ. 16 ఏళ్ల వయసులోనే తాను అతడి ప్రేమలో పడ్డానని, తమ ప్రేమ ఎన్సీసీ క్యాంపులో మొదలైందని.. ఆ టైంలో తనకు ప్రేమ, ఎఫైర్స్ లాంటి వాటిపై నమ్మకం లేదని.. అందుకే సరైన నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది అనసూయ. ఆ తర్వాత ఒకర్నొకరు అర్థం చేసుకున్న తర్వాత ఇంట్లోవాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే తానే చాలాసార్లు బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని బలవంతపెడితే.. అలాంటి పెళ్లికి గౌరవం ఉండదని భరద్వాజ్ చెప్పడంతో తానే కూల్ అయ్యానని.. ఆ తర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాతే అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈమె.

ఈ ఛాటింగ్ లోనే ఓ అభిమాని.. “మీ ఇద్దరి మధ్య గొడవలు రాలేదా.?” అనడిగిన ప్రశ్నకు కూడా జవాబిస్తూ.. “ఎందుకు రాలేదు.. చాలాసార్లు గొడవపడ్డాం. వారానికోసారి ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉంటామని, అందుకే ప్రతి వారం విడాకులు తీసుకుంటాం.. కానీ అంతలోనే కలిసిపోయి విడాకులను పెడాకులు చేసి విసిరేస్తామని నవ్వుతూ చెప్పుకొచ్చింది అనసూయ. చదివారు కదా.. నమ్మకం వున్నచోట ప్రేమ వుంటుంది. ప్రేమ వున్నచోట సర్దుకుపోయే మనస్తత్వం వుంటుందని థమ దాంపత్య జీవితంలోని సరదా సంఘటనలను ఎంత చక్కగా వివరించిందో కదా మన రంగమ్మత్త. ఈ ఫ్యామిలీ టిప్స్ మీకు నచ్చితే మరి మీరూ ఫాలో అయిపోండిక..!😀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here