బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా “అంధాధూన్” ను తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. హీరో నితిన్ కథానాయకుడుగా నటిస్తున్నారు. అయితే దేనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం పూర్తీ చేసారు. హీరో నితిన్ తప్ప మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఒక పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయను ఫైనల్ చేసినట్టు చిత్ర యూనిట్ నుండి వస్తున్న సమాచారం.

ఒరిజినల్ “అంధాధూన్” లో టబు చేసిన కీలక పాత్రలో యాంకర్ అనసూయ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ చిత్రంలో విలన్ గా నటించిన టబు ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే తెలుగు రీమేక్ లో కూడా ఆ పాత్రకోసం టబు ని సంప్రదించగా ఆమె కోటి రూపాయిల పారితోషకం అడిగిందట. టబు డిమాండ్ చూసి ఖంగుతిన్న నిర్మాతలు మనసు మార్చుకుని ఈ పాత్ర కోసం అనసూయని సంప్రదించారట. ఈ చిత్రానికి గాను అనసూయకు 10 లక్షలు ముట్టనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా..

అనసూయ చేస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.. మరి కొద్దిరోజులలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదివరకే అనసూయ విలన్ పాత్ర చేసిన విషయం మనకి తెలిసిందే… క్షణం చిత్రంలో ఈ హాట్ యాంకర్ విలన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో రీమేక్ లోని విలన్ పాత్రకు ఆమెను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.




























