Anchor Anasuya : ఒక న్యూస్ చానెల్ లో మొదట తన కెరీర్ ని ప్రారంభించిన అనసూయ, తరువాత మా మ్యూజిక్ లో యాంకర్ గా చేసింది. ఆ తరువాత ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అభిమానులలో క్రేజ్ ని సొంతం చేసుకుంది. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా తన అందం తో నటనతో ఆకట్టుకుంటోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో నాగార్జున సరసన నటించి తెలుగు సినిమాలలో అడుగు పెట్టింది.

తరువాత వరుసగా సినిమాలలో నటిస్తున్న అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా పుష్ప సినిమాతో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ క్రేజీ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా అనసూయకి సంబందించిన ప్రోగ్రాం ప్రోమో ఒక్కటి వచ్చింది. అయితే అందులో అనసూయ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మాస్ స్టెప్పులతో మతి పోగొడుతున్న…

తాజాగా “పార్టీ చేద్దాం పుష్ప” అనే ప్రోగ్రాం లో హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ప్రొగ్రాం కి సంబంధించన ప్రోమో విడుదలైంది. అంతేకాక మాస్ డాన్స్ దానికి తగ్గ డ్రెస్ తో అధరగొట్టింది. ఇక సోషల్ మీడియా లో తన ఫోటోషూట్లతో అదరగోడుతూనే ఉంటుంది. ముప్పై పదుల వయస్సులో కూడా తన అందంతో అందరి మనసులను దోచేస్తుంది. తాజాగా “పార్టీ చెద్దాం పుష్ప” అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా వచ్చిన ఈ అమ్మడు.. ఓ మాస్ పాటకు అదిరిపోయే డాన్స్ చేసింది. ఆ పాటలో అనసూయ వేసిన డ్రెస్తో వయసులో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రమోకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



























