Anchor Anasuya : బుల్లితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన అతి కొద్దిమంది యాంకర్లలో అనసూయ మొదట గుర్తొస్తుంది. సాక్షి టీవీ లో న్యూస్ రీడర్ గా మొదలైన అనసూయ ప్రస్థానం జబర్దస్త్ తో కొత్త మలుపు తీసుకుంది. ఇక జబర్దస్త్ తో అనసూయ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. ఇక టీవీల్లో యాంకర్ గా వివిధ షోలు చేస్తూనే సినిమాల్లోను నటించి క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంది. తాజాగా అనసూయ క్రిష్ డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక అమ్మడు జబర్దస్త్ ద్వారానే బాగా ఫేమస్ అయి ఆ తరువాత సినిమాల్లోకి లాంగ్ జంప్ చేసింది.

సుమ తరువాత అనసూయనే…
యాంకరింగ్ చేస్తూనే మరో వైపు జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన అనసూయ, ఆషో పాపులరిటీతో బాగా సంపాదించిందని టాక్. ఆస్తులను బాగా పోగేసిన అనసూయ ఆ మధ్య ఇన్కమ్ టాక్స్ ఎగొట్టిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఐటి అధికారుల సోదాలు కూడా జరిగాయంటూ వార్తలు వినిపించాయి. సినిమాల్లో ఫుల్ బిజీగా మారిన అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఓన్లీ సినిమాలు అంటూ అటు పరభాషా చిత్రల్లోను నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. అలా అమ్మడికి ఏకంగా 25 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. యాంకర్ సుమ తరువాత తెలుగు ఇండస్ట్రీలో బాగా ఆస్తులు పోగేసింది అనసూయనే అంటూ టాక్ కూడా వినిపిస్తోంది.

దాదాపు 8 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు జూబ్లీహిల్స్ లో అనసూయ కు ఉందట, అంతే కాకుండా 2.5 కోట్లు విలువ చేసే రెండు కార్లు ఉన్నాయట. ఇక మిగతా ఆస్తులన్నీ కలిపి సుమారుగా 25 కోట్లకు పైనే అమ్మడి ఆస్తుల చిట్టా తేలింది. సంవత్సరానికి సుమారు 2 నుండి 3 కోట్లు అనసూయ సంపాదిస్తోంది మరి. అందరూ పెళ్లికి ముందు కెరీర్ పీక్స్ లో ఉండి పెళ్లయ్యాక డల్ అవుతుంది అదేంటో అనసూయ కు మాత్రం పెళ్లయ్యాక కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది.































