బుల్లితెర యాంకర్ గా అనసూయకు మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వెండితెరపై కూడా తనదైన ట్రెండ్ ని సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తోంది అనసూయ. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాలని చూస్తోంది.

ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగ మార్తాండచిత్రమే కాకుండా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తోంది. కాకపోతే ఈమధ్య కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ 3 చిత్రాల షూటింగ్ వాయిదా పడింది. కరోనా మహమ్మారి విలయ తాండవం ఆగితేనే కానీ ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం కాని పరిస్థితి నెలకొని వుంది. టాలీవుడ్ పరిస్థితే ఇలా వుందంటే గత 4 నెలలుగా బుల్లితెర షూటింగ్‌లు కూడా బంద్ అయ్యాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం అనుమతివ్వడంతో కొన్ని సీరియల్స్ షూటింగ్ ప్రారంభించిన నటీ, నటులలో కొంత మందికి కరోనా సోకడంతో కొన్ని టీవీ సీరియల్స్ షూటింగ్ ఆపేశారు.

అనసూయ టీవీ షోలు చేయాలనుకున్నా కరోనా దెబ్బతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది. గత కొన్ని నెలలుగా ఇంట్లోనే వుంటున్న అనసూయ తాజాగా ఓ హాట్ యోగాని ప్రాక్టీస్ చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. పొట్ట కదిలిస్తూ రామ్‌దేవ్ బాబా స్టైల్ లో అనసూయ చేసిన హాట్ యోగా నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది. హాఫ్ స్కర్ట్, హాఫ్ టీషర్ట్ వేసుకుని పొట్టని కదిలిస్తూ అనసూయ చేసిన హాట్ యోగాపై నెటిజన్స్ హాట్ హాట్ గా కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు.



























