యాంకర్ అనసూయ కన్నీళ్లు పెట్టించే ప్రేమకథ !! చివరకు ఏమయిందో తెలుసా ??

0
646

యాంకరింగ్ అనే దానికి అందాన్ని కలబోసి మరింత ఆసక్తి కరంగ మార్చిన యాంకర్ అనసూయ భరద్వాజ్. పెళ్లి తర్వాత కూడా మహిళలు తమ కెరీర్ నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగించవచ్చు అనడానికి అనసూయ మంచి ఉదాహరణగా చూపించ వచ్చు. కుటుంబాన్ని, కెరీర్ నీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. అనసూయ సినిమాలను, యాంకరింగ్ రెండిటిలోనూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది. ఆ స్థాయికి రావడానికి తను ఎంతో కష్టపడింది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తి గత జీవితంలో కూడా చాలా కష్టాలు చవిచూసింది. ముఖ్యంగా తన ప్రేమ విషయంలో ఎన్నో ఒడిదుడుకలను చూసింది. అనసూయ ఆమె భర్త భరద్వాజ్ 9 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరి ప్రేమ కూడా చాలా ఆసక్తి కారంగా సాగింది అని అనసూయ గుర్తుచేసుకుంటూ చెప్పడం జరిగింది.

అనసూయ ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం చదివే రోజుల్లో NCC క్యాంప్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెనే గ్రూప్ కమాండర్ కావడంతో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష కూడా వేసేదట. అయితే అదే క్యాంప్ కి అనసూయ భర్త భరద్వాజ్ కూడా వచ్చాడు. ఆ క్యాంప్ లో అనసూయని చూసి భరద్వాజ్ చూడగానే అనసూయకి లవ్ ప్రపోజ్ చేశాడట. అదికూడా ప్రేమిస్తున్నాను అని కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామని అని అడిగాడట. అల చెప్పగానే ఆ వయసులో పెళ్లి ఎంటి అని అనసూయ ఆశ్చర్య పడిందట అంతే కాకుండా అతని దైర్యనికి, అడిగిన విధానానికి ఆమె అప్పుడే పడిపోయింది. కానీ ఆ విషయం అతనికి చెప్పకుండానే ఆ క్యాంప్ నుండి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ వాళ్ళు ఎపుడు కలవడంగానీ, మాట్లాడుకోవడంగానీ జరగలేదు.

సరిగ్గా సంత్సరంన్నర తర్వత మళ్లీ అదే క్యాంప్ లో కలవడం జరిగింది. అప్పటికి అనసూయకు భరద్వాజ్ పై ఒక మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్లిద్దరి మధ్య స్నేహం మొదలయింది.. అలా కొద్ది రోజుల తర్వాత నెమ్మదిగా స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ అనసూయ ఆ విషయాన్ని ఆమె తల్లి కి మాత్రమే చెప్పింది. అనసూయకి ఇద్దరు చెల్లెలు ఉండటంతో తనకి మంచి సంబంధం చూసి చేస్తే తన చెల్లెళ్లకు కూడా మంచి సంబంధాలు వస్తాయని అనసూయ తండ్రి అనుకునేవారట. కానీ అనసూయ మాత్రం భరద్వాజ్ నే పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కూడా అనసూయ తండ్రి మాత్రం వేరే సంబంధాలు చూడడంతో అనసూయకి ఇంట్లో వాళ్ళ నాన్నతో చాలా గొడవలు జరిగేవట అయినా కూడా అనసూయ అతన్నే చేసుకుంటా అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళి కొద్ది రోజులు హాస్టల్ లో ఉంది.

ఎప్పటికైనా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాం అని ఆమె భర్త భరద్వాజ్ ఆమెకు దైర్యం చెప్తూ ఉండేదట… అలా హాస్టల్ నుండి ఇంట్లోకి వెళ్లిన తరువాత కూడా వాళ్ల పెళ్లికి మాత్రం ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అక్కడి నుండి తండ్రి కుతుర్లకు మాటలు కట్ అయ్యాయి. అనసూయ ఒకసారి దైర్యం చేసి భరద్వాజ్ తో నాకు పెళ్ళి చేసే వరకు ఇంటి నుండి కాలు బయట పెట్టను అని తెగేసి చెప్పిందట. ఇక చివరకు చేసేదేమిలేక ఆమె తండ్రి ఒప్పుకున్నారని, దానికి కూడా చాలా సమయం తీసుకున్నారట. అలా 9 సంవత్సరాలు వరకు ఓపిక పట్టి ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమించిన భరద్వాజ్ ని 10 ఫిబ్రవరి 2010 న వివాహం చేసుకున్నారు అనసూయ, భరద్వాజ్ జంట.

ఇప్పుడు వీళ్ళ పండంటి కాపురానికి ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రేమించిన వాడికోసం కుటుంబంతో 9 సంత్సరాలు పోరాటం చేసి చివరికి తన ప్రేమనీ గెలిపించుకుంది అనసూయ. మొత్తానికి అనసూయ లవ్ స్టోరీ సినిమా కధలను మించిన కధలా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here