సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమ నటనకు గుర్తింపు రావడం కోసం కష్టపడుతుంటారు. యాంకర్ గానే కాకుండా నటి కూడా తను ఎంటో తెలియచేస్తున్న నటి అనసూయ భరద్వాజ్. అనసూయ యాంకరింగ్ లో బుల్లితెరపై తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అంతే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.. తెలుగు సినిమాలలో మంచి పాత్రలను ఎంచుకుంటూ నటనలో నైపుణ్యాన్ని పెంచుకుంటుంది. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర రంగమ్మత్త ఆమె కెరీర్ లో మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టింది.. అంతకు ముందు అనసూయ నటించిన సినిమాల కంటే రంగమ్మత క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ లేక అందరు ఇంటికి పరిమితం అవ్వడంతో స్టార్స్ వారి అభిమానులతో లైవ్ లో ముచటిస్తున్నారు. మాములుగానే అనసూయ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో తన యొక్క అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటుంది. ఇక అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ హాలిడేస్ తో ఇంటికే పరిమితమైన కారణంగా ఇపుడు మరింతగా లైవ్ చాట్ లతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన యొక్క పెర్సనల్ విషయాలు కూడా మాట్లాడడం విశేషం.

అదలావుంటే లైవ్ లో ఒక అభిమాని ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలలో ఛాలెంజింగ్ గా అనిపించిన పాత్ర ఎది అని అడగడం జరిగింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ అని అనసూయ చెబుతుంది అని అందరు భావించారు. కానీ అనసూయ అందరి ఆలోచనలకి విరుద్ధంగా అస్సలు ఇప్పటి వరకు తనకు ఈ పాత్ర కూడా ఛాలెంజింగ్ గా అనిపించలేదు అని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు అయితే అంతా ఈజీగా చేశారా రంగమ్మత్త పాత్ర అంటూ సెటైర్ లు కూడా వేస్తున్నారు. సుకుమార్ వంటి టాప్ డైరెక్టర్ అంతా మంచి క్యారెక్టర్ ఇస్తే అది ఛాలెంజింగ్ గా లేదు అనడంతో సుకుమార్ ఫ్యాన్స్ అనసూయ మీద ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా త్వరలో తమిళ ఇండస్ట్రీకి కూడా వెళ్తున్నట్టు అనసూయ చెప్పడం జరింది. దీంతో అక్కడ కూడా ఛాలెంజింగ్ పాత్ర ఇస్తారో లేదో అనసూయకి చూడాలి అంటూ కొంత మంది నెటిజన్లు అంటుండం విశేషం.

































