Anchor Anasuya : తెలుగు బుల్లితెర మీద సంచలనం సృష్టించిన ప్రోగ్రాములలో జబర్దస్త్ ఒకటి. 2013, ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ఇప్పటివరకూ కూడా టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా కొనసాగుతోంది. షో మొదట్లో అనసూయ యాంకర్ గా రోజా, నాగబాబు న్యాయ నిర్ణేతలుగా మొదలై, ఇపుడు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్తలుగా కొనసాగుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కామెడియన్ లను అభిమానులకు పరిచయం చేసింది. అనసూయ ఈ ప్రోగ్రాం ద్వారా చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇపుడు చాలా మంది, కారణాలు తెలియటం లేదు గాని జబర్దస్త్ ని వీడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇపుడు అనసూయ పేరు కూడా వినిపిస్తోంది.

శీను, ఆది, సుధీర్… ఇపుడు అనసూయ కూడా…
కొన్ని కారణాల వలన నాగబాబు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోవడం అపుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అపుడు నాగ బాబు తో పాటు చంద్ర వంటి కొంతమంది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఇపుడు మళ్ళీ వలస కార్యక్రమం మొదలైంది. కారణాలు తెలియటం లేదు కానీ ఇటీవల శీను, ఆది, సుధీర్ జబర్దస్త్ ను విడిచిపెట్టారు. సుధీర్ ఐతే జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా విడిచిపెట్టారు. అయితే ఇపుడు అనసూయ కూడా జబర్దస్త్ వీడూతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే స్టార్ కమెడియన్లు లేక రేటింగులు తగ్గుతున్నాయి. ఇపుడు అనసూయ జబర్దస్త్ వీడుతోందా, ఎందుకు వెలుతోంది అన్న విషయాలు తెలియడం లేదు. రెమ్యూనరేషన్ సమస్యనా.. లేక సినిమా ఆఫర్ల కారణంగా షోకి దూరం అవుతోందా క్లారిటీ లేదు. ఈ విషయం పై స్పందించి అనసూయనే క్లారిటీ ఇస్తే సరిపోతుంది.































