Anchor Anitha Chowdary : తొంభైల్లో యాంకర్ గా అన్ని ఛానెల్స్ లో పనిచేసి పాపులర్ అయిన అనితా చౌదరి ఈటీవీ లో యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఆ తరువాత మంజుల నాయుడు గారి సీరియల్ కస్తూరితో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుసగా ఋతు రాగాలు, నాన్న అంటూ సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోనూ నటించిన అనితా చౌదరి మొదట హీరోయిన్ గా శ్రీకాంత్ తాళి సినిమాలో అవకాశం వచ్చి స్క్రీన్ టెస్టు లో పాస్ అయినా యాంకరింగ్ ఒక ఏడు నెలలు మానేయమని చెప్పడంతో అవకాశం వదులుకుంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛత్రపతి, మురారి, ఉయ్యాల జంపాల ఇలా చాలా సినిమాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పరమైన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలిపారు.

నాన్న లేని లోటు అమ్మ తీర్చింది… శ్రీకాంత్ అలా అన్నాడు…
అనిత తల్లిదండ్రులది ప్రేమ వివాహం, ఇక తండ్రి కలకత్తాలో ఉద్యోగం చేయడం వల్ల అనిత అక్కడే పుట్టింది. ఇక ఆ తరువాత అనిత కుటుంబం హైదరాబాద్ రావడంతో చదువు అంతా హైదరాబాద్ లో సాగింది. ఐదో తరగతి చదివే సమయంలో తండ్రి దూరమవ్వడంతో తల్లి బాధ్యత తీసుకుంది. తండ్రి మరణించాడో, ఉన్నాడో కూడా తెలియదు అంటూ చెప్పింది. ఇక విజయవాడకు చెందిన ధనిక కుటుంబంలో పుట్టిన తన తల్లి ప్రేమ వివాహం వల్ల పిల్లల బాధ్యతలను తీసుకుని పెంచింది. మాకు తండ్రి లేని లోటు లేకుండా పెంచింది. ఇక అమ్మ, అన్నలు కుటుంబ బాధ్యత తీసుకున్నారు. నేను ఇంటర్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని అంటూ చెప్పింది అనిత.

ఇక చదువు ఎంతో ఇష్టమైనా మధ్యలో ఆపేసి ఈటీవీ లో యాంకర్ గా అవకాశం వచ్చి కుటుంబ బాధ్యత తీసుకున్నాను అంటూ చెప్పింది అనిత. ఇక పెళ్లి గురించి పెద్దగా అభిప్రాయం లేకపోవడంతో తన భర్త మొదట ప్రపోజ్ చేసినా అమెరికా రాను అని రిజెక్ట్ చేసిందట. ఇక అనిత భర్త హీరో శ్రీకాంత్ కి కజిన్ కావడంతో శ్రీకాంత్ ఫోన్ చేసి మావాడు అమెరికా నుండి వచ్చి నిన్ను పెళ్లిచేసుకుంటా అంటున్నాడు పెళ్లి చేసుకో అని చెబితే మొదట నాకు కదా చెప్పాలి నాకు చెప్పకుండా అందరికీ చెప్తున్నాడని ఒక మూడేళ్లు మాట్లాడలేదు. మళ్ళీ ఆఫీషియల్ గా వచ్చి అడగడంతో పెళ్లి చేసుకున్నాను అంటూ తన ప్రేమ వివాహం గురించి చెప్పింది.


































