Anchor Anitha Chowdary : కస్తూరి సీరియల్, రుతురాగాలు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనితా చౌదరి అటు పబ్లిక్ షోస్ చేస్తూనే ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ లో మంచి గుర్తింలు తెచ్చుకుంది. ఇక సీరియల్స్, యాంకరింగ్ వల్ల ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న హీరోయిన్ గా చేయకూడదనే ఉద్దేశంతో చేయలేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సినిమాల్లో నటించిన అనిత చాలా సినిమాల్లో పాత్రలను మిస్ చేసుకున్నాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే మంచి రోల్స్ వదులుకోనని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో వదులుకున్నా…
కస్తూరి సీరియల్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు టైటిల్ రోల్ అంటే అవగాహన లేదు. అదీ కాక సీరియల్ విషయంలో ఫుల్ బిజీగా ఉండటం వల్ల సినిమా వదులుకున్నా. ఆ సినిమా చేసుంటే బాగుండు అని మల్లీ అనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ తో రెండో సారి ఫ్రెండ్ పాత్రలో తీన్మార్ సినిమాలో నటించాల్సింది ఆ సినిమా అవకాశం చేజారింది.

ఇక చాలా సినిమాల్లో హీరోయిన్ అవకాశం వదులుకున్నాను అయితే పెళ్లయ్యాక అమెరికా కి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండటం వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాను అంటూ చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో నటించే అవకాశం రాలేదు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా చేస్తాను. వాళ్లకు ఇదే నా రిక్వెస్ట్ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట్లాడారు. నాగార్జున గారు నాకు ఒక తెలియని టీచర్ అంటూ చెప్పారు అనిత.
































