తెలుగు టీవీ రంగంలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి, ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన ఎదుగుదలను చూసి కొందరు అసూయతో ఓర్వలేకపోయారని, తనపై చేతబడి చేయించారని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు టీవీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

రవి ఆరోపణలు, సమాజంపై అభిప్రాయాలు
యాంకర్ రవి మాట్లాడుతూ, “మా బ్యాచ్‌లోని ఒక మహిళా యాంకర్ నాపై చేతబడి చేయించింది. ఒక ప్రసిద్ధ పూజారి దగ్గరకు వెళ్లి పూజలు చేసింది. నా డౌన్‌ఫాల్ (పతనం) కోరుకుంది. ఈ విషయం నాకు తెలిసింది. నేను స్వయంగా కొన్ని విషయాలు చూశాను కూడా. ఎవరో ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం సహజమే. కానీ ఇలా చేయడం వల్ల వాళ్లకు ఏం లాభమో నాకు అర్థం కాలేదు. నేను అలాంటివి నమ్మను. అలాంటి వాటితో నాకు ఏమీ జరగదని గట్టి నమ్మకం ఉంది” అని చెప్పారు.
అలాగే ఆయన ప్రస్తుత సమాజ పరిస్థితులపై కూడా స్పందిస్తూ, “ఇప్పుడు సొసైటీ చాలా విషపూరితంగా మారిపోయింది. ఏఐ (AI) వచ్చిన తర్వాత మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సరిగా వాడటం లేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతాడు, పేదవాడు ఇంకా పేదవాడవుతాడు. ఎంప్లాయిమెంట్ లేకపోవడంతో చాలా మంది తమ ఒత్తిడిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. నాకు విదేశాల్లో బెటర్ ఫ్యూచర్ లభిస్తే నేను కూడా వెళ్లిపోతాను” అని పేర్కొన్నారు.
యాంకర్ రవి కెరీర్ ప్రస్థానం
యాంకర్ రవి ‘సంథింగ్ స్పెషల్’ అనే షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత పలు షోల్లో యాంకర్‌గా అవకాశాలు దక్కించుకుని స్టార్ స్టేటస్‌కి ఎదిగాడు. ఆయన కెరీర్‌లో లాస్య, శ్రీముఖి వంటి పాపులర్ యాంకర్లతో కలిసి పని చేశారు. ‘సంథింగ్ స్పెషల్’, ‘పటాస్’, ‘వన్ షో’, ‘ఢీ జూనియర్స్’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘మొండి మొగుడు పెంకీ పెళ్లాం’, ‘కిర్రాక్’, ‘అలీ టాకీస్’ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కూడా ‘ఇది మా ప్రేమ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టెలివిజన్ రంగంలోకి రాకముందు ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న రవి, కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేశారు.
‘చేతబడి’ చేసిన యాంకర్ ఎవరు?
యాంకర్ రవి చేసిన ఈ వ్యాఖ్యలతో, ఆయనపై చేతబడి చేసిన మహిళా యాంకర్ ఎవరు అన్నది టెలివిజన్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రవి పేరు చెప్పకపోవడంతో, ఈ విషయంపై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. ఈ వివాదం టీవీ పరిశ్రమలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.



























