యాంకర్ ప్రదీప్ కి సర్ప్రైజ్ ఇచ్చిన జీ తెలుగు… ఎమోషనల్ అయిన ప్రదీప్ !!

0
305

పెద్దగా పరిచయం అవసరం లేనివారిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకరు. తన యొక్క సమయస్ఫర్తితో అందరినీ ఆటపట్టిస్తు నవ్వించడం లో ప్రదీప్ తన కంటు ఒక స్థానాన్ని నిలుపుకున్నారు.యాంకరింగ్ లో మేల్ యాంకర్ లో ప్రదీప్ మొదటి స్థానంలో ఉన్నాడు..యాంకరింగ్ లో తన ప్రతిభ తో మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్ ఇపుడు హీరో గా తన యాక్టింగ్ కెరీర్ ని మొదలు పెట్టాడు…తన మొదటి సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”, ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీస్ చేసిన కొన్ని రోజుల్లోనే యూట్యూబ్ లో మిల్లియిన్ వ్యూస్ని సంపాదించింది..అలాగే tiktok లో కూడా చాలా వీడియోస్ ట్రెండింగ్ లో వున్నాయి. ఈ సాంగ్ వల్ల ప్రదీప్ కి మరి కొంత మంది లేడీ ఫ్యాన్స్ పెరిగే అవకాశం వుంది. ఆ సాంగ్ లో తన నటనను చూసి ప్రేక్షకులు ఎంతో సంతోషిస్తున్నారు… వెలంటైన్ డే సందర్భంగా జీ తెలుగు నిర్వహించిన ఒక షో కి ప్రదీప్ నీ గెస్ట్ ఇన్వైట్ చేశారు.. ఎంతో మందికి సర్ప్రైజ్ లు ఇచ్చిన ప్రదీప్ కి తన సినిమా లో సాంగ్ తోనే సర్ప్రైజ్ చేయగా,అది చూసి ప్రదీప్ స్టేజి పైనే ఎమోషనల్ అయ్యాడు…

అంతేకాకుండా జీ తెలుగు తన పుట్టిల్లు అని చెప్పుకొచ్చారు.. జీ తెలుగు సపోర్ట్ వల్లనే తాను ఈ స్థానంలో వున్నాను అని, జీ తెలుగు లో ఏ షో చేసిన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఎన్నో షో లు చేసిన ఈ జీ తెలుగు ఛానల్ కి తన మొదటి సినిమా తో గెస్ట్ గా రావడం ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని ప్రదీప్ తన సంతోషాన్ని తెలియచేశారు. ప్రదీప్ జీ తెలుగు లో తన సొంత బ్యానర్ లో షోలు కూడా చేశాడు.. అందులో “కొంచెం టచ్ లో ఉంటె చెప్తా.. ” షో లో సెలబ్రెటీ లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా అందరి మన్ననలను అందుకున్నాడు. అలాగే మిగతా ఛానెల్స్ మరియు ఈవెంట్స్ చేస్తూ అందర్నీ మెప్పిస్తున్న ప్రదీప్ ఇక మీదట హీరో గా కనిపిస్తున్నాడు.. తన మొదటి సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here