టాలీవుడ్ హీరోలందరికి ప్రస్తుతం కరోనా తలనొప్పులు తప్పడంలేదు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. బుల్లితెరపై మకుటంలేని మహారాజుగా వెలిగిన ప్రదీప్ ఊహించనిరీతిలో హీరోగా మారిపోయాడు. అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ప్రదీప్ తొలిసారిగా ఫుల్ లెంగ్త్ హీరోగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అంటూ సినిమా మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలని భావించారు. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టాడు ప్రదీప్.

అన్ని బాగుంటే ఈపాటికి సినిమా విడుదలై తెలుగు ప్రేక్షకులముందు ప్రమోషన్లు, సక్సెస్ మీట్స్ అంటూ బిజీ బిజీ గా గడిపేవాడు. ఒక్కసారిగా కరోనా వైరస్ ప్రదీప్ ఆశలకు అడ్డుకట్టవేసింది. కొత్త దర్శకుడు మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికీ సినిమాలోని పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి. “నీలి నీలి ఆకాశం” అనే పాట సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో మిళియన్స్ వ్యూస్ తో ట్రేండింగ్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు ప్రదీప్. మ్యూజిక్ భారీ హిట్ అవడంతో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావించాడు. కానీ కరోనా ప్రదీప్ ఆశలపై నీళ్లు చల్లింది.

అసలే లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించారు. ఏప్రిల్ 30 తరువాత కూడా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో తెలియదు. అదీగాక మరో టెన్షన్ ప్రదీప్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ప్రదీప్ సినిమాతో పాటుగా మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా నిలిచిపోయాయి. ఒకవేళ మే నెలలో సినిమా థియేటర్లు మొదలైనా.. థియేటర్ల కోసం భారీ ఫైట్ తప్పేట్టు లేదు. మే, జూన్ వరకు ఆ బడా సినిమాలకే థియేటర్లు పరిమితమవుతాయి. ఇప్పుడే ఇదే బెంగ పట్టుకుని పీడిస్తోండేట మనోడిని. వేసిన మొదటి అడుగులోనే కరోనా దెబ్బ పడింది. మరి మనోడి వెండితెర జాతకం ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here