తెలుగు బుల్లి తెర సెన్షేషన్ ప్రదీప్. ఈయన అంటే అమ్మాయిలు ఎంతగా పడి చస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ ఇతడికి అమ్మాయిలు ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. అంతటి గుర్తింపును దక్కించుకున్న ప్రదీప్ పెళ్లి గురించి బుల్లితెరపై ఆయన నటించే ప్రతీ షోలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే ఇకపై బుల్లితెర షోలలో యాంకర్ ప్రదీప్ పెళ్లి పై జోకులు వేసే ఛాన్స్ ఎవరికీ ఉండదు. ఎందుకంటె.. త్వరలోనే మన ప్రదీప్ పెళ్ళికొడుకు కాబోతున్నాడట. ఇప్పటికే “పెళ్లిచూపులు” కార్యక్రమం కూడా జరిగిపోయిందట. ఇక పెళ్లి బాజాలు మోగడమే ఆలస్యమని తెలుస్తోంది.

అధికారికంగా ప్రదీప్ ప్రకటించకపోయినా.. అటు బుల్లితెర, ఇటు సినీ వర్గాల్లో కూడా ప్రదీప్ పెళ్లి వార్త మారింది. త్వరలోనే ప్రదీప్ తన పెళ్లి శుభవార్త అందరికీ చెబుతాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ తెలిసిన సమాచారం ప్రకారం 33 ఏళ్ల ప్రదీప్ ఓ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడని తెలుస్తుంది. అతను చేసుకోబోయే అమ్మాయి సినిమా, టీవీ రంగాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వస్తోందని, ఆమె రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్ గా ఉన్న ఒక యువనేత అని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఈ యువ రాజకీయవేత్తనే యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ ప్రస్తుతం టీవీ సర్కిళ్లలో వినబడుతుంది. మరి ప్రదీప్ చేసే అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి తన పెళ్లి విషయంపై ఇప్పటికైనా ప్రదీప్ క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోవైపు తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందు కనిపించిన ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. కానీ., ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో ఈ సినిమా ఇంకా ధియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ద్వారానే ప్రదీప్ ఓ ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసుకోవడం విశేషమని చెప్పాలి. ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమాలోని “నీలి నీలి ఆకాశం” సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డును హీరోగా తన తొలి సినిమా విడుదల కాకముందే ప్రదీప్ సొంతం చేసుకున్నాడు.






























