బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్ అయింది. సోనమ్ చేసిన పనికి ట్విట్టర్ వేదికగా కడిగిపడేసింది. వివరాల్లోకి వెళితే కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అవసరమైతే తప్ప బయటకి రావడం లేదు. అయితే సెలెబ్రెటీస్ ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొందరు లైవ్ చాట్ పెట్టుకుని మరీ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ “నేను ఒక చాక్లేట్ కేక్ చేశాను. అయితే నేను చేయాలనుకున్న సమయానికి ఇంట్లో చాక్లేట్ లేకపోతె ఓక్ ఫుడ్ సప్లై సంస్థ నాకు ఒక క్వాలిటీ చాక్లేట్ ను పంపింది. వారికీ నా కృతఙ్ఞతలు, లవ్యూ న్యూఢిల్లీ..” అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన యాంకర్ రష్మీ “మీరు ఎంత ప్రివిలేజ్ అయితే మాత్రం.. దేశం ఇష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీ సరదా కోసం అందులోను ఓక కేకుకోసం అక్కడకి అంతమందిని పంపిస్తారా…అది అంత ముఖ్యమా..” అంటూ ట్వీట్ చేసింది.
Being privileged comes with certain perks but also responsibility
— rashmi gautam (@rashmigautam27) April 11, 2020
Making people move around for chocolate delivery isn’t really imp and at the same time u end up making people run to stores cause there fav celeb has baked https://t.co/4NIvq9J9YW




























