జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మి గౌతమ్… ఈ టీవిలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ వంటి టీవీ ప్రోగ్రామ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఈ అమ్మడు గురించి నిత్యం ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రష్మి కి సంబందించిన రెండు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒడిశాలో 5 కోట్లు పెట్టి 100 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని ఒక వార్త ఒక పక్క ట్రెండ్ అవుతుంటే.. మరో పక్క రష్మి పెళ్లికి రెడీ అవుతుందనే వార్త ప్రచారంలో ఉంది. రష్మి టాప్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతుందనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఆ టాప్ యాంకర్ ఎవరా అనే కదా మీ ఆలోచన? ఆ యాంకర్ ఎవరో కాదు మన యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూ ఈ మధ్యనే వెండితెరపై హీరోగా కొత్త అవతారం ఎత్తాడు ప్రదీప్ మాచిరాజు. అంతేకాదు ప్రదీప్ ఢీ ఛాంపియన్స్ లో యాంకర్ కూడా.. ఇక్కడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అంటున్నారు. అదలావుంటే ఢీ ఛాలెంజ్ షోలో రష్మి, ప్రదీప్ లతో పాటు సుధీర్ కూడా ఉంటారు. ఇదివరకే సుధీర్, రష్మి పై చాలా రూమర్స్ వచ్చాయి. సుధీర్, రష్మి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు అప్పట్లో చాలా జోరుగా వినిపించాయి. అయితే వీటిని ఖండిస్తూ వీరిద్దరూ పలుమార్లు మీడియా ముందు చెప్పారు.

అయితే సుధీర్, రష్మిల లాగే ప్రదీప్, రష్మి జోడీ కి కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ప్రదీప్, రష్మి, సుధీర్ ఈ ముగ్గురు కలిసి ఒక స్టేజి మీద ఉంటే ఇక ప్రేక్షకులకు నవ్వు ఆపుకోవడం కష్టమే… అంతగా నవ్విస్తారు. ఢీ షోలో రష్మి, ప్రదీప్ కలిసి సుదీర్ ని ఉడికిస్తూ ఉంటారు. దానితో ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు ప్రదీప్, రష్మి పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. 2020 సమ్మర్ లో వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఇదంతా జోక్ అని కొట్టిపారేస్తుంటే.. మరి కొందరు నిప్పులేనిదే పొగరాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రదీప్, రష్మి ఇద్దరు ఈ విషయంపై స్పందిస్తే వాస్తవాలు బయటకి వస్తాయి. లేకపోతె మౌనం అర్ధాంగీకారం అంటూ మరిన్ని వార్తలు వైరల్ అయ్యే ప్రమాదముంది.

Courtesy by MallemalaTV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here