సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై సంచలన యాంకర్. కేవలం తెలుగులోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా సుధీర్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇంకా చెప్పాలంటే.. సుధీర్ పేరుని పచ్చబొట్లు వేసుకోవడం.. ఇతనిపై స్పెషల్ థీంగ్ సాంగ్స్ రూపొందించడం వంటివి చేస్తున్నారంటే సుధీర్ ఏ రేంజ్‌లో ఉన్నడో అర్థం చేసుకోవచ్చు.

తెలుగులో అయితే పొరపాటున స్కిట్‌లో సుధీర్‌పై ఎవరైనా పంచ్‌లు వేసినా.. తక్కువ చేసినా సుధీర్ ఫ్యాన్స్ ఆ పంచ్ వేసిన వాళ్ల తాట తీసేంతగా. సుధీర్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్యనే ఒక ఈవెంట్‌లో బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్ స్కిట్‌లో భాగంగా సుధీర్‌ని హౌలే, ఫాల్త్ అన్నందుకు రాహుల్ సిప్లిగంజ్ పై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. జబర్దస్త్‌లో చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుధీర్ చేసే కామెడీలో ఒక విభిన్నమైన స్టైల్ ‌ ఉండటం వల్ల చాలామంది మహిళా ప్రేక్షకులకు కూడా సుధీర్ అంటే ఇష్టం. విచిత్రం ఏంటంటే.. సుధీర్ చేసే స్కిట్స్‌లలో ఎక్కువగా అతన్నిఓ అమ్మాయిల పిచ్చోడిగా.. మహా కామ పిశాచిగా చూపిస్తుంటారు. అయినప్పటికీ కూడా జబర్దస్త్‌లోని ఇతర కమెడియన్లలాగా సుధీర్ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకునేలా కామెంట్స్ చేయకుండా ఉండేలా వివాదాలకు దూరంగానే ఉంటాయి.

అయితే బుల్లితెరపై సంచలన యాక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించిన సుధీర్.. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడని చెప్పాలి. తన తండ్రి మరణంతో కుటుంబ భారమంతా సుధీర్‌పైనే పడటంతో పదేళ్ల క్రితం కేవలం 8 వేల జీతానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగంలో చేరిన సుధీర్.. ఏదో సాధించాలన్న కసితో ఆ ఉద్యోగం మానేసి సింగిల్ రూంను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ ఆకలి బాధల్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తినడానికి తిండిలేక పెరుగు పేకెట్, రూ.1 ప్రియా పచ్చడితో కడుపు నింపుకున్న రోజులున్నాయని అప్పుడప్పుడు చెప్తుంటాడు సుధీర్. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో సింక్‌లో పైపులో వచ్చే నీళ్లను తాగిన సందర్భాలు సుధీర్ జీవితంలో ఉన్నాయి. రెండున్నరేళ్ల పాటు ఆకలి బాధల్ని భరించిన సుధీర్.. తన తల్లి తనని నటుడిగా చూడాలని కోరుకునేదని ఆ కోరిక కోసం తన కష్టాన్ని భరించేవాడినని చెప్తుంటాడు సుధీర్. కాని పదేళ్లు తర్వాత ఇప్పుడు సుధీర్ గతం తెలిసినవాళ్ళెవ్వరికైనా కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు.. కాని అదే గతాన్ని సుధీర్ కళ్ల ముందుంచితే ఆ విషాద సంఘటనలు, అతని గతం సుధీర్ గుండెల్ని బరువెక్కిస్తుంటాయి. తాజాగా ఢీ షోలో కూడా అదే జరిగింది.

సుడిగాలి సుధీర్ గతంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు? ఎలా స్టార్ అయ్యాడనే అంశాలతో ఒక స్పెషల్ సాంగ్ ను క్రియేట్ చేశారు ఢీ టీమ్. లేటెస్టుగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. తన గత జ్ఞాపకాలు, పడిన బాధలన్నీ సుధీర్ కళ్ల ఆవిష్కరించడంతో వాటిని తల్చుకుని ఏడ్చేశాడు సుడిగాలి సుధీర్. సుధీర్‌తో పాటు జడ్జీలు, యాంకర్ రష్మి కూడా సుధీర్‌ని పట్టుకుని ఏడ్చేసింది. సుధీర్ హార్డ్ వర్క్.. అతని జర్నీ చాలా పెయిన్ ఫుల్ అంటూ రష్మి ఏడుస్తూ చెప్పిన మాటలు ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here