“మగువా మగువా..” అనే పాట ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఈ పాట. తాజగా అదే పాటకు స్పూఫ్ చేస్తూ అందరిని నవ్విస్తున్నాడు బుల్లితెర యాంకర్ రవి.

“పురుషా.. పురుషా” అంటూ పాటను పేరడీ చేసి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఒక విడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “ఇది నా 400వ పోస్ట్, మగజాతి అనిముత్యాలందరికీ దీనిని అంకితం చేస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు. ఆడవాళ్ళూ గొప్పే.. కానీ మగవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు అంటూ మరో కామెంట్ చేసాడు.
అయితే యాంకర్ రవి చేసిన ఈ స్పూఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవి సరదాగా చేసిన ఈ వీడియో కు భారీ రేస్పాన్సే వస్తుంది. అటు అభిమానులనుంచి మరియు తోటి యాంకర్లు కూడా ఈ వీడియో పై సరదాగా స్పందిస్తున్నారు. “ఎన్ని రోజులకు ఇంట్లో పని చేస్తున్నావు రవి” అని భానుశ్రీ అంటే… “అయ్యో రావణ ఏంటి ఇలా అయిపోయావ్..? అయినా మస్త్ ఉందిలే చూడటానికి” అంటూ యాంకర్ వర్షిని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ విడియో నేటిజన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ విడియో మీకు కూడా చూసేయండి.



























