యాంకర్ రవి బుల్లితేర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే యాంకర్ రవి ఎక్కడుంటే అక్కడ సందడే.. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ రచ్చ చేస్తుంటాడు యాంకర్ రవి. అయితే అడపాదడపా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ యాంకర్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసాడు… అందులో తన అభిమానులతో నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండలేక తనకు తెలిసిన వంటలు చేసుకుంటూ అవి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయకు ఒక ప్రాంక్ కాల్ చేసి ఆటపట్టిద్దాం అనుకున్నాడట. ఫోన్ చేసి ఆట పట్టిద్దాం అనుకుంటే చివాట్లు పెట్టివదిలిందట అనసూయ. వివరాల్లోకి వెళితే… ప్రాంక్ కాల్ లో భాగంగా అనసూయకు ఫోన్ చేసి తాను తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడట. అసలు విషయం తెలియక అనసూయ నిజంగానే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసారు అనుకుని మాట్లాడేస్తుందట. రవిని గుర్తుపట్టలేదట. చివరికి రవి స్వయంగా తానే నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాదు.. యాంకర్ రవిని మాట్లాడనున్నాని చెప్పాల్సి వచ్చిందట. విషయం తెలుసుకున్న అనసూయ ఇది ప్రాంక్ చేసే టైం ఆ అంటూ.. ఫైర్ అయిందట. అయితే వీరిద్దరి మధ్యలో ఉన్న మంచి రిలేషన్, చనువుతో అనసూయ బూతులు తిడుతూ విరుచుకుపడిందట. దీనితో షాక్ తినడం రవి వంతైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here