ప్రముఖ యాంకర్ రవి నిజానికి ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి గత కొద్ది రోజుల నుండి వివాదాలకు దూరంగా వుంటూ మంచి మంచి ఆఫర్లను రాబట్టుకోవడంలో బిజీగా వుంటున్నాడు. అయితే వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో ‘బాపు బొమ్మకి పెళ్లంట’ అనే స్పెషల్ షోకు సంబంధించిన వరుస ప్రోమోలను ఈమధ్యనే విడుదల చేశారు. ఈ షోలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న యాంకర్ రవి తన కుటుంబం గురించి, తన భార్యతో కలిసి తన వ్యక్తిగత లైఫ్ గురించి భావోద్వేగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. నిత్యతో తన లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది.? కాపురం ఎలా కొనసాగుతుంది? భార్యతో గొడవలు వస్తే ఎలాంటి టిప్స్ పాటించాలి.? తన కెరియర్ ప్రస్తుతం ఎలా ఉంది? మొదలైన ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

నా ఫ్యామిలీని నిలబెట్టింది నా భార్య అంటూ రవి తన సతీమణి గురించి చెప్పుకొచ్చాడు. `ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద ఈవిధంగా నిలబెట్టింది నా భార్య నిత్య సక్సేనా. నాకోసం తన ఇగో ఫీలింగ్స్ ను కూడా పక్కనపెట్టేసింది. ఆరున్నరేళ్లు నా భార్య నా వలన ఎంత టార్చర్ ఎంత అనుభవించిందో నాకు తెలుసు. గతంలో నాపై ఎఫైర్స్ అని మాట ఎక్కువగా వినిపించేది. ఆ టైంలో ఏంటి మీ ఆయన ఆవిడతో ఉన్నాడట కదా.? ఈమెతో ఎఫైర్ అంట. మీ ఆయనకు ఇంకో పెళ్లైందా? లాంటి రూమర్స్ నా భార్య మాకు పెళ్ళైన క్రొత్తలో చాలా విన్నది. కాని నా వరకూ చాలాసార్లు నవ్వుతూనే అడిగేది కానీ ఏమీ అనేది కాదు. నాకు పెళ్లై ఎనిమిదేళ్లు అయ్యింది.. కాని నాకు పెళ్లైందని బయటపెట్టింది ఏడాదిన్నర క్రితం. ఆరున్నరేళ్లు మా ఆవిడ నా వల్ల ఎంత టార్చర్ ఎంత అనుభవించిందో నాకు తెలుసు.. కాని ఆమె ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నేను ఇలా ఫీల్ అవుతున్నా అని చెప్పలేదు.. ఎందుకంటే.. సినిమా రంగంలో ఉండాలి.. మంచి పేరు తెచ్చుకోవాలని ముందుకు వెళ్తున్నప్పడు చాలామంది పెళ్లైంది అని తెలిస్తే.. ఛాన్స్‌లు ఇవ్వరు.. క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి. నిన్ను బాధపెట్టినందుకు సారీ నీతూ.. నువ్విలాంటివన్నీ గమనిస్తూనే వుంటావని అని తెలుసు.. నన్ను క్షమించు“ అంటూ స్టేజ్‌పై మోకాళ్లపై కూర్చుని అందరి ముందు తన భార్యకు క్షమాపణ చెప్పి యాంకర్ రవి భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇంకా తమ వైవాహిక జీవితం గురించి చెబుతూ.. “మా లవ్ స్టోరీ చాలా డిఫరెంట్. పెళ్లయ్యేంత వరకూ కూడా మేం ఒకరినొకరం ప్రపోజ్ చేసుకోలేదు. మేమిద్దరం బీటెక్‌లో ఒకే కాలేజ్, ఒకే క్లాస్. మాకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది. ఈ గ్రూప్‌లో అందరికంటే ఎక్కువ నిత్యతో నేను ఎక్కువ మాట్లాడటం.. ఆమె నాతో మాట్లాడటం.. వాళ్ల ఫ్యామిలీ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కావడంతో మా పెళ్లి చాలా ఈజీగా జరిగిపోయింది. మా పెళ్లికి పెద్దగా స్ట్రగుల్ పడిన సందర్భాలేమీ లేవు. కాలేజ్ లో స్నేహితులుగా వున్న మా ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టడమనేది చాలా నేచురల్‌గా జరిగింది. బీటెక్‌లో సెకండ్ ఇయర్ నుంచి ఒకరిపై ఒకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం.“ అంటూ తమ దాంపత్య జీవితం గురించి చెప్పుకొచ్చాడు.



























