Anchor Shyamala : బుల్లితెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల అటు టీవీ షో లలో బిజీగా ఉంటూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్యామల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత అటు యాంకర్ గాను ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతోను బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్యామల తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువైంది. ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమాలో తన నటనతో ప్రశంసలను అందుకుంది. గతంలో తన భర్త మీద చీటింగ్ కేసు ఉదంతం గురించి శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఆ మహిళకు మా ఇంట్లో భోజనం పెట్టాను…
రెండేళ్ల క్రితం ఒక మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తన వద్ద కోటి రూపాయిలు తీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. 2017 నుంచి 2021 వరకూ తన దగ్గర కోటి రూపాయిల వరకూ డబ్బులు వసూలు చేశాడని తనని మోసం చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారం లో నర్సింహారెడ్డికి, శ్యామల గారు ఆ సమయంలో సపోర్ట్ గా నిలిచారు.

ఇక ఆ ఇష్యూ గురించి మళ్ళీ తాజాగా ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడారు. తన భర్త ఎలాంటి వాడో తనకి బాగా తెలుసనీ, ఆ మహిళ మా ఇంటికి కూడా వచ్చిందని నేనే వండి పెట్టాను, అలాంటి ఆమె మా ఆయన మీద తప్పుడు కేసు పెట్టింది. ఆ రెండు రోజులు బాగా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. నిజం తెలియడానికి సమయం పడుతుంది కానీ నిజం ఖచ్చితంగా బయటికి వస్తుంది. అదే ఈ ఇష్యూలో కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసు క్లియర్ అయింది. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ అయింది అంటూ చెప్పారు యాంకర్ శ్యామల.
































