Anchor Shyamala : ప్రీ రిలీజ్ ఈవెంట్లలో యాంకర్ అనగానే గెస్టులందరినీ రకరకాల ప్రశ్నలడుగుతూ సినిమాకి సంబంధించిన విషయాలను రాబడుతూ ఉంటారు. ఇక సరదాగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసం వాళ్ళతో ఏదో ఒక స్కిట్స్ లేదా రాపిడ్ ఫైర్ లాంటివి చేయడము మామూలే. కొన్నిసార్లు ఇలాంటివి మిస్ ఫైర్ కూడా అవుతుంటాయి. ఈవెంట్ ని బోర్ కొట్టించకుండా ఎంటర్ టైన్ చేయాలని హోస్ట్ లు ఏవేవో ఫీట్లు చేస్తుంటారు కానీ కొన్నిసార్లు అతిగా మాట్లాడి విమర్శల పాలు అవుతుంటారు.

యాంకర్ శ్యామల పై సీరియస్ అయిన ఆర్జీవి…
ఆర్జీవి కొండా సినిమా రిలీజ్ అయిందో లేదో అప్పుడే మరో సినిమా రిలీజుకు సిద్ధమైంది. అదే పూజ బాలేకర్ నటించిన ‘లడ్కి’ చిత్రం. ఇందులో బ్రూస్లీ అభిమానిగా పూజ నటించనుంది. ఇక ఇప్పటికే విడుదలయిన యాక్షన్ సన్నివేశాల్లో పూజ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు చిత్ర యూనిట్. హోస్ట్ గా శ్యామల ఈవెంట్లో అందరినీ ఎంటర్ టైనా చేస్తూ హుషారు పెంచింది. ఇక సినిమా గురించి ఆర్జీవి స్టేజి మీదకు వచ్చినపుడు పూజ గురించి మాట్లాడి వెళ్లిపోతుంటే శ్యామల ఒక ఫన్నీ గేమ్ ఆర్జీవి తో ప్లాన్ చేసింది. యాక్షన్ నేపథ్యంలో సినిమా కాబట్టి ఇతర భాషల్లో లో వచ్చిన యాక్షన్ సినిమాలను తెలుగులో అనువదించి శ్యామల చెబితే ఒరిజినల్ సినిమా పేరు ఆర్జీవి చెప్పాలి.

మొదట సరే అన్న ఆర్జీవి కిల్ బిల్ గురించి వచ్చినప్పడు చెప్పలేదు ఇక రెండో సినిమా పేరు శ్యామల చెప్పేలోపు నేను ఆ మూడ్ లో లేను సినిమా గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నా అంటూ స్టేజి దిగి వెళ్ళిపోయాడు. దీనితో శ్యామల ఆర్జీవి కి సారీ చెప్పి ప్రోగ్రామ్ కంటిన్యూ చేసింది. అలా ఆర్జీవి శ్యామల తో సీరియస్ గా మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అమ్మాయి (లడ్కి) సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.



























