Anchor Siva : బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లిన ఎవరు అయినా బయటికి వచ్చిన తరువాత బాగా ఫేమస్ అవుతారు. వాళ్ల కెరీర్ లో మంచి అవకాశాలను అందుకుంటారు. అభిమానులు, మీడియా అటెన్షన్ తో ఫుల్ స్వింగ్ లో కెరీర్ ఉంటుంది. ఇక తాజాగా పోయిన శనివారంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ ముగిసింది. టాప్ 4 లో అఖిల్, బిందు, అరియనా, యాంకర్ శివ మిగిలారు. ఇక టైటిల్ కోసం హోరాహోరి పోటీపడ్డా టైటిల్ మాత్రం ఆడపులి బిందు మాధవి గెలుచుకుంది.

ఇక రన్నర్ అప్ గా అఖిల సార్థక్ మరోసారి నిలిచాడు. ఇక అరియనా బ్రీఫ్ కేసు తీసుకొని వెళ్లడంతో యాంకర్ శివ మూడో ప్లేసులో లో నిలిచాడు ఇక బిగ్ బాస్ ముగిసాకా కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక వాళ్లకు స్వాగతం పలకడానికి అభిమానుల హంగామా మాములుగా చేయరు. రోడ్ షోలు, అభిమానుల కోలాహలంతో రచ్చ చేస్తారు. ఇక యాంకర్ శివ బయటికి వచ్చాక ఇలానే ఫ్యాన్స్ హంగామా చేసారు.
AnchorShiva craze ea verabba ????
— Shiva Fans Ikkada ⚡????❤️???? (@iamkundum) May 21, 2022
Anchor Shiva on the way home ????@anchor_shiva #AnchorShiva #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/Z5GsaDBb9Q
ఓపెన్ టాప్ కారులో శివను ఊరేగిస్తూ రోడ్ షో నిర్వహించారు. అభిమానులు రోడ్లపై ఎక్కువమంది గుమిగూడడంతో కారును ఆపి డాన్సులు చేస్తూ ఊరేగించడం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయింది వెనకున్న వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ఇక పోలీసులు రంగం లోకి దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసారు. ఇక యాంకర్ శివకుమార్ కి క్లాస్ పీకారట ఒక లేడీ కానిస్టేబుల్. ఓపెన్ టాప్ కారులో వెళ్లడం ఏంటి ఇలా అనుమతి లేకుండా రావద్దు, షో నిర్వహించడం ఏంటని వారించారట. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.


































