Anchor Srimukhi : ప్రస్తుతం ఎక్కువ పాపులరిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్ లలో ఒకరుగా బుల్లితెర మీద కొనసాగుతున్నారు శ్రీముఖి. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ‘అదుర్స్’ అనే ఓ ప్రోగ్రాముతో యాంకర్‌గా పరిచయమైన శ్రీముఖి ఒక వైపు యాంకర్గా రాణిస్తూనే, మరో వైపు ప్రోగ్రాములకు వ్యాఖ్యతగాను, సినిమాలలో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ప్రోగ్రాములలో తన యాంకరింగ్ తో అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసికుంటూ అభిమానులను అలరిస్తోంది. తన ఎనర్జెటిక్ టాలెంట్ తో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది.

కెరీర్ ప్రారంభంలో వేధింపులు ఎదుర్కొన్న శ్రీముఖి…
శ్రీముఖి యాంకర్ గా కెరీర్ ప్రారంభించినపుడు మరొక మగయాంకర్ తో కలసి చేసేదట. అపుడు శ్రీముఖి కి అంత పేరు, డిమాండ్ లేదు. ఈ క్రమంలో ఆ యాంకర్ తప్పుగా బిహేవ్ చేసేవాడట. అంతే కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటే రాత్రికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి మంచి ఆఫర్ అని, ఆమె నో చెప్పినా రమ్మని వేధించేవాడట. అయితే అతని ప్రవర్తన గురించి అంచనా వేసి తనని దూరం పెడుతూ వచ్చిందట.

అయితే ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది. తర్వాత కెరీర్లో యాంకర్ ప్రదీప్, రవిలతో కూడా స్టేజి షేర్ చేసుకుంది. రవితో పాటు చేసిన పటాస్ షో తో పాపులరిటీ తెచ్చుకున్న శ్రీముఖి తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి మరింత ఫేమ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో వరుసగా ప్రోగ్రాములు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు బుల్లితెర మీద బిజీ యాంకర్ లలో ఒకరుగా కొనసాగుతోంది.

































