బుల్లితెరపై శ్రీముఖి యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. యాంకరింగ్ లోకి రాక ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతాగా గుర్తింపు తెచుకోలేకపోయింది. యాంకరింగ్ మొదలుపెట్టాక ముఖ్యంగా ఈటీవీ ప్లస్ లో వచ్చిన “పటాస్” షో ద్వారా టాప్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ అప్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపందిచుకుంది. అంతే కాకుండా తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇక సినిమాలో నటించానని ఖరాఖండిగా చెప్పేసిన ఈ ముద్దు గుమ్మ. టీవీ షో, రియాలిటీ షోలు,రిలీజ్ ఫంక్షన్స్ తదితర ఈవెంట్స్ తో బిజీగా ఉండే ఈ భామ ఇపుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తుంది.

తాజగా తనకు ఎదురైన అనుభవాలు అభిమానులతో పంచుకుంటుంది. అంతే కాకుండా కొత్తగా శ్రీముఖి యూ ట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి దానిలో ఇంటి వద్దనే ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్య ఒక యూ ట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు గోవాలో ఎదురు అయిన విషయాలు చెప్పడం జరిగింది. తనకి క్యాషినో గేమ్ అంటే పిచ్చి అని గోవా వెళ్ళినప్పుల్లా ఆడుతూ ఉంటాను అని చెప్పింది. మొదట్లో ఆడినపుడు డబ్బులు వచ్చాయని, అలా రావడం తో రెండు మూడు సార్లు ఆశతో వెళ్ళిన ప్రతిసారీ ఆడుతున్నప్పుడు డబ్బులు అన్ని పోయాయి అని చెప్పుకొచ్చింది. ఒకసారి అయితే చేతిలో ఉన్న డబ్బులు అన్ని పోగొట్టుకున్నాను అని, అందుకే ఇంకా గోవా వెళ్ళిన క్యాషినో గేమ్ మాత్రం ఆడటం లేదని చెప్పుకొచ్చింది.
