Anchor Suma : యాంకర్ గా సుమ పంచులకు అందరూ అభిమానులే. తన మీద తానే జోకులు వేసుకుంటూ ఎదుటి వారి మీద పంచులు వేస్తూ సమయస్ఫూర్తి తో ఆకట్టుకునే సుమ క్యాష్ షో గురించి చెప్పక్కర్లేదు. షో లో వచ్చిన గెస్ట్ లను ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ వారం క్యాష్ షో కి గెస్ట్ లుగా వాంటెడ్ పండుగాడ్ టీం వచ్చారు. యష్ మాస్టర్, నిత్యా శెట్టి, అనసూయ, విష్ణు ప్రియ, కాంటెస్టంట్స్ గా వస్తే ఇక దర్శకేంధ్రుడు రాఘవేంద్ర రావు గారు అతిధి గా విచ్చేసారు. ఇక షోలో రాఘవేంద్ర రావు గారు, సుమ మధ్య సాగిన పంచులు అదిరిపోయాయి.

ఆ పాపం మీదే అంటూ కామెంట్స్…
షో లోకి రాఘవేంద్ర రావు గారు అనసూయ చేయి పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకు అలా వచ్చారని అడిగితే కాలేజ్ లో చదివేటపుడు అనసూయ అనే ఒక అమ్మాయి గుర్తు వచ్చింది అంటూ చెప్పారు రాఘవేంద్ర రావు. ఇక సుమ అనే అమ్మాయి మీ చదివే రోజుల్లో లేదా అని సుమ అడుగగా, సుమ లేని జీవితం ఉందా అంటూ రాఘవేంద్ర రావు అన్నారు. ఇక మీ పెళ్లి చేసింది నేనే మర్చిపోయావా అని సుమ నీ చూసి రాఘవేంద్ర రావు అన్నారు.

ఇక వెంటనే సుమ మా పెళ్లి పాపం మీదే అంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఇపుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక విష్ణు ప్రియ పెళ్లి అంటూ గోల చేయడం, యష్ మాస్టర్, నిత్యా శెట్టి అబ్బా అబ్బా అంటూ వాంటెడ్ పండుగాడ్ సినిమాలోని పాటకు డాన్స్ చేయడం ఆకట్టుకున్నాయి. ఇక సుమ, అనసూయ కలిసి పెళ్లి సందడి సినిమాలోని నవ మన్మధుడా పాటకు డాన్స్ వేయగా రాఘవేంద్ర రావు గారు అక్కా ఎవరే అతగాడు అన్నపుడు నన్ను చూపించండి అంటూ జోక్ చేయడంతో మంచి ఫన్ తో ప్రోమో సాగింది.



























