“సుమ కనకాల” ఈ పేరు తెలియని బుల్లితెర మరియు సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఆమె క్రేజ్ మమోలుగా ఉండదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.. కరోనా సమయంలోనూ యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లు, అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో నటీనటులు అందరూ వారి ఇళ్లకే పరిమితమైయ్యారు. చాలా మంది పనులు లేక ఇబ్బందు పడుతున్నారు. ఇటీవలే సుమ కూడా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే..

అయితే తాజగా సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలుపెట్టింది. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆమె తన సోషల్ మీడియాలో పలు ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తుంది. తాజాగా సుమ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది. ‘ఇడ్లీ దినోత్సవం” పేరుతొ సుమ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఏదో ఒక డే ఉన్నప్పుడు ఇడ్లీకి ఓ డే ఉండకూడదా? అంటూ వేడి వేడి ఇడ్లీలను తయారు చేసింది సుమ.
దీనితో పాటూ పనిలో పనిగా ఒక కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్ ను కూడా ప్రమోట్ చేసింది సుమ. అందులో పుట్నాల పొడి, కారంపొడి, సుమకు ఏంతో ఇష్టమైన చల్ల మిరపకాయల పొడి మొదలగునవి ఉన్నాయంటూ వారి ఉత్పత్తులను వివరిస్తూ విడియో చేసింది సుమ. ఇక ఈ ప్రోడక్టులు కావాల్సిన వారు వాట్సప్ లో లేదా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ సుమ తన స్టైల్లో ప్రమోషన్ చేసింది సుమ. ఇక మొత్తానికి ఇంట్లో ఉంటూ ప్రమోషన్స్ తోనే భారీగా డబ్బులు సంపాదిస్తుంది సుమక్క.



























