తెలుగు టీవీ షోలలో యాంకరింగ్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు సుమా కనకాల. తన స్పాంటేనియస్ పంచ్ లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఎప్పటినుంచో అలరిస్తుంది. సుమా షో చేస్తుంది అంటే చాలు ఆ షో సగం సక్సెస్ అయినట్టే అని కొందరి అభిప్రాయం. అల తన గలగల మాటలతో, నవ్వులతో ఎవరిని హూర్ట్ చేయకుండా ఎపుడు చలాకిగా ఉంటుంది. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా చాలా బిజీ గా గడుపుతుంది. చాలా సినిమాలకు సుమ లక్కీ చాంప్ గా తయారయింది. కొందరు నిర్మాతలుకు అయితే సుమా హోస్ట్ చేస్తే చాలు మూవీ సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన సుమకి పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఈ మధ్యనే “సుమక్క” పేరుతొ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది.
అదలావుంటే ఈటీవీలో క్యాష్ షోని సుమ ఎప్పటి నుండో యాంకరింగ్ చేస్తుంది. ఈ షోకి యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?” టీo రావడం జరిగింది. మున్నా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి పరిచయం కాబోతున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన “నీలి నీలి ఆకాశం.. ” అనే పాట ఇప్పటికే చాలా పాపులర్ అయింది. యూట్యూబ్ లో ఈ పాట ఫుల్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు హీరోగా నటించిన యాంకర్ ప్రదీప్ ని కాష్ షోలో సుమ ఒక రేంజ్ లో ఆడేసుకుంది. మాములుగానే ప్రదీప్ కూడా పంచ్ లు బాగా వేస్తాడు. ఇంకా వీళ్లిద్దరు ఒక స్టేజి పై కలిస్తే పంచ్ వర్షంతో నవ్వుల సునామీ నీ సృష్టిస్తారు. తాజాగా ఈ షో కి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు.
ఇందులో భాగంగా సుమ, ప్రదీప్ ఒకరి మీద ఒకరు బాగా సెటైర్లు వేసుకున్నారు. ప్రోగ్రాం లో సుమని పంట పొలాల్లో సెట్ వేసి గడ్డివాము మీద కూర్చోపెట్టారు. దానికి ప్రదీప్ మీరు పడితే స్లో మోషన్ షాట్ తెస్తామని, చాలా రోజులకు సుమ కదలకుండా… ఒక చోట బాగా కూర్చోబెట్టారు అని పంచ్ వేశాడు. అంతే కాకుండా ఒక స్కిట్ లో ప్రదీప్ నీ సుమ మనవడు గా యాక్ట్ చూపించారు. దానిలో సుమ, ప్రదీప్ నీ “ఒక్కగానొక్క మగాడు..” అని పుసుక్కున మాట జారీ దానిని వెంటనే “ఛీ..ఛీ..” అని సరిదిద్ది “ఒక్కగానొక్క మనువడు..” అని మార్చి చెప్పింది. దీనికి ఈ షో ఉన్న వారంతా ఒక్కటే నవ్వులు. వీరిద్దరూ ఒకరికొకరు రివర్స్ పంచ్ లు వేసుకుంటూ ప్రోగ్రాం లో సందడి చేసినట్టు కనిపిస్తుంది.
అంతే కాదు ఇంకా చాలా ఉన్నాయి. చాలా మిగిలిన వారితో కూడా చాలా స్కిట్స్ చేసారు. ప్రదీప్ తోనేకాదు.. మిగిలిన గెస్టులు సింగర్ సునీత, అనూప్ రూబెన్స్, చిత్ర యూనిట్ తో కలిసి సుమ చేసిన హంగామా మొత్తం బుల్లితేర మీద క్యాష్ ప్రోగ్రాం లో ఫిబ్రవరి 22వ తేదీన రాబోతుంది. చూసి ఎంజాయ్ చేయండి.
ఈ ప్రోమో మీకోసం..





























