ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పగలు కూడా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌కు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 తరువాత క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. మరో రెండు వారాల పాటు ఈ క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు చేయనున్నట్టు తెలుస్తోంది.. ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

ఇప్పటికే రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యా భారీగా పెరుగుతుండటంతో కరోనా ధాటిని తగ్గించేందుకు పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది జగన్ సర్కార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here